iQOO Anniversary Sale 2025 : ఐక్యూ వార్షికోత్సవ సేల్.. ఈ ఐక్యూ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి..!
iQOO Anniversary Sale 2025 : ఐక్యూ కంపెనీ వార్షికోత్సవ సేల్ సందర్భంగా ఐక్యూ మోడల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

iQOO Anniversary Sale 2025
iQOO Anniversary Sale 2025 : ఐక్యూ కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో ఐక్యూ ఇండియా ఐదేళ్ల వార్షికోత్సవ సేల్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఐక్యూ 13తో (iQOO Anniversary Sale 2025) సహా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ, డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందిస్తోంది.
కొత్త ఐక్యూ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ సేల్ జూన్ 13న ముగుస్తుంది. కస్టమర్లు అమెజాన్ లేదా ఐక్యూ ఈ-స్టోర్‌కు వెళ్లి డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐక్యూ ఫోన్లపై రూ. 22వేల వరకు సేవ్ చేయవచ్చు. ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఐక్యూ 13 ధర :
ఐక్యూ 13 5G ఫోన్ రూ.52,999కు పొందవచ్చు. రూ.2వేలు తగ్గింపుతో కొనుగోలుదారులు ఉచితంగా ఐక్యూ TWS 1e ఇయర్‌బడ్‌ల పెయిర్ (రూ. 1,899) కూడా పొందవచ్చు.
ఐక్యూ 12 ధర :
పాత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఐక్యూ 12 5G కూడా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ప్రస్తుతం రూ.6వేలు తగ్గడంతో రూ.44,999కు లభిస్తుంది. అన్‌వర్స్డ్ స్మార్ట్‌ఫోన్ రూ.50,999కు అందుబాటులో ఉంది.
మిడ్-రేంజ్ డీల్స్ :
ఐక్యూ నియో 10 తక్కువ ధరకే పొందవచ్చు. రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ. 29,999కి తగ్గుతుంది. ఐక్యూ నియో 10R రూ. 2,500 తగ్గింపు తర్వాత రూ. 24,499కు లభ్యమవుతుంది. ఐక్యూ Z10 రూ. 2వేల తగ్గింపుతో లభిస్తుంది. ధర 19,999కి తగ్గుతుంది. ప్రస్తుతం ఐక్యూ Z9s రూ. 1,500 తగ్గింపు తర్వాత రూ. 17,499కు లభిస్తుంది.
ఎంట్రీ లెవల్ డీల్స్ :
ఐక్యూ Z10x ఫోన్ ధర రూ.12,749కి అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఐక్యూ Z9x ఫోన్ రూ.11,999కి అందుబాటులో ఉంది. ఐక్యూ Z9 లైట్ ధర రూ.750 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆ తర్వాత Z9 లైట్ ఫోన్ ధర రూ.9,749కి తగ్గింది. ఫ్రీ ఆఫర్లు, లిమిటెడ్ టైమ్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది.