×
Ad

Motorola Edge 70 Sale : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. మోటోరోలా ఎడ్జ్ 70 ఫస్ట్ సేల్ ఇదిగో.. బ్యాంకు ఆఫర్లతో అతి తక్కువ ధరకే..!

Motorola Edge 70 Sale : మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. బ్యాంకు ఆఫర్లతో ఈ మోటోరోలా ఫోన్ అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.

Motorola Edge 70 Sale

Motorola Edge 70 Sale : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొత్త లేటెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఇటీవలే మోటోరోలా ఎడ్జ్ 70 లాంచ్ కాగా ఇప్పుడు ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 23న ప్రారంభమైంది.

ఫీచర్లు,ఏఐ, పవర్ ఫుల్ ప్రాసెసర్ స్ట్రాంగ్ 5000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా వస్తుంది. ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 70 ధర ఎంతంటే? :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ధర విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ ధర రూ. 29,999కు లభ్యమవుతుంది. కంపెనీ ప్రారంభ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ల ద్వారా రూ. 1000 కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్లపై మీకు రూ. 1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్ల వివరాలివే :
డిస్‌ప్లే : ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ HDR10 ప్లస్ కూడా అందిస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 7iని కలిగి ఉంది.

Read Also : Vivo X200 : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో X200పై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

చిప్‌సెట్ : స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ :
ఈ మోటో ఫోన్ ఆండ్రాయిడ్ 16 హలో యూఐపై రన్ అవుతుంది. ఇందులో అనేక ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి.

కెమెరా సెటప్ : ఫొటోగ్రఫీ వీడియోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా బ్యాక్ సైడ్ త్రీ-ఇన్-వన్ లైట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కూడా ఉంది.

బ్యాటరీ : పవర్ విషయానికి వస్తే.. 68W వైర్డు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ధర వద్ద నథింగ్ ఫోన్ (3a), రియల్‌మి 14 ప్రో ప్లస్ 5G, వివో T4 ప్రో 5G, ఒప్పో రెనో 13 5G వంటి మోడళ్లను కొనుగోలు చేయొచ్చు.