Motorola Razr 50 Ultra : మోటోరోలా లవర్స్ మీకోసమే.. ఈ ఫోల్డబుల్ రేజర్ 50 అల్ట్రాపై క్రేజీ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Razr 50 Ultra : ప్రీమియం ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ కోరుకునే కస్టమర్లు మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Motorola Razr 50 Ultra

Motorola Razr 50 Ultra : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గింది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫోల్డబుల్ (Motorola Razr 50 Ultra) ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ డీల్‌లో లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లో భాగంగా కాంప్లిమెంటరీ మోటో బడ్స్ ప్లస్ కూడా సొంతం చేసుకోవచ్చు.

రూ. లక్ష లోపు ఉన్న మోటోరోలా స్టైలిష్ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ. 69,990కే లభ్యమవుతోంది.  అసలు ధర నుంచి ఏకంగా రూ. 30వేలు తగ్గింది. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా రేజర్ 50 అల్ట్రా డీల్ :
అమెజాన్‌ లిమిటెడ్ టైమ్ డీల్‌లో మోటోరోలా రెజర్ 50 అల్ట్రాతో పాటు మోటో బడ్స్ ప్లస్ రూ. 5,999కు ఫ్రీగా అందిస్తోంది. ప్రీమియం ఫ్లిప్ ఫోన్ అప్‌గ్రేడ్ కోసం అమెజాన్ ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ 4-అంగుళాల LTPO అమోల్డ్ కవర్ స్క్రీన్‌ 165Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే స్ట్రాంగ్ డిజైన్ కలిగి ఉంది. మీరు ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. 6.9-అంగుళాల FHD+ ఫోల్డబుల్ అమోల్డ్ డిస్‌ప్లే కనిపిస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌ కూడా కలిగి ఉంటుంది.

Read Also : Senior Citizen Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అటల్ పెన్షన్ పథకం.. నెలకు రూ. 210 డిపాజిట్ చేస్తే చాలు.. రూ. 5వేలు పెన్షన్..!

హుడ్ కింద, ఈ మోటోరోలా ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రాలో డ్యూయల్ 50MP కెమెరా సెటప్, OISతో కూడిన ప్రైమరీ సెన్సార్, 2x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మెయిన్ డిస్‌ప్లే లోపల 32MP ఫ్రంట్ షూటర్ కూడా ఉంది. 4000mAh బ్యాటరీతో 45W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.