Senior Citizen Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అటల్ పెన్షన్ పథకం.. నెలకు రూ. 210 డిపాజిట్ చేస్తే చాలు.. రూ. 5వేలు పెన్షన్..!
Senior Citizen Scheme : సీనియర్ సిటిజన్లు అటల్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీగా రూ. 5వేలు పెన్షన్ పొందవచ్చు.

Senior Citizen Scheme
Senior Citizen Saving Scheme : సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన పథకం.. రిటైర్మెంట్ తర్వాత కూడా అధిక మొత్తం రాబడి పొందవచ్చు. వృద్ధాప్యంలో ఆదాయం గురించి ఆందోళన అవసరం ఉండదు. అటల్ పెన్షన్ యోజన అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 60 ఏళ్లు పైబడిన పేదలు, తక్కువ ఆదాయం పొందేవారికి అందిస్తోంది. ప్రతి నెలా రూ. 1,000 నుంచి రూ. 5వేల వరకు పెన్షన్ పొందవచ్చు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఏ పౌరుడైనా ఈ పథకంలో చేరవచ్చు. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత కూడా అధిక ఆదాయం :
మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా మీ ఆదాయాన్ని పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా 60 ఏళ్ల వయస్సు తర్వాత మీకు ప్రతి నెలా రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. కానీ, ఈ పెన్షన్ పథకంలో ఎంత డబ్బు డిపాజిట్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఒక కస్టమర్ మరణిస్తే.. ఈ పెన్షన్ భర్త లేదా భార్యకు అందుతుంది. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే.. ఆ మొత్తం డబ్బు నామినీకి అందుతుంది.
నెలకు రూ. 5వేలు పెన్షన్ పొందాలంటే? :
అటల్ పెన్షన్ యోజన (APY)లో ప్రతి నెలా చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. తద్వారా రిటైర్మెంట్ తర్వాత రూ. 5వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ఉదాహరణకు.. 18 ఏళ్ల వయస్సులో రోజుకు రూ. 7 అంటే.. నెలకు రూ. 210 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతి నెలా రూ. 5వేలు పెన్షన్ పొందవచ్చు.
మీరు నెలకు రూ. 42 మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1000 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో కనీసం 20 ఏళ్లు పెట్టుబడి అవసరం. 40 ఏళ్ల వయస్సులో పెట్టుబడితో మీరు 60 ఏళ్ల వయస్సులో పెన్షన్ పొందవచ్చు.
ఈ పథకానికి అర్హత ఏంటి? :
అటల్ పెన్షన్ యోజనలో కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. ఈ పథకంలో దరఖాస్తు కోసం వ్యక్తి వయస్సు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 40 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుదారుడు యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్, కేవైసీకి లింక్ చేయాలి. భారతీయ పౌరులు మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు.
ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
అటల్ పెన్షన్ యోజన పథకం ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా సమీప బ్యాంకు శాఖకు వెళ్లి అటల్ పెన్షన్ యోజన ఫారమ్‌ను తీసుకోండి. ఆపై దరఖాస్తును నింపండి. మీ పేరు, వయస్సు, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మొదలైన ఫారమ్‌లో అడిగిన వివరాలను నింపండి. అవసరమైన డాక్యుమెంట్లను కూడా అటాచ్ చేయండి.
ఫారమ్‌ను సమర్పించిన తర్వాత బ్యాంక్ అధికారులు మీ వివరాలను ధృవీకరిస్తారు. ఈ సమయంలో రూ. 1000 నుంచి రూ. 5000 వరకు ఏ పెన్షన్ పథకం కావాలో ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మీ అకౌంట్ పథకానికి లింక్ అవుతుంది.