iPhone 16 Pro : ఇది కదా ఆఫర్.. భారీ తగ్గింపు ధరకే ఐఫోన్ 16 ప్రో.. ఇప్పుడే కొనడం బెటర్.. ఐఫోన్ 17 వచ్చేవరకు ఆగుతారా?
iPhone 16 Pro : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింది.. ఏకంగా రూ. 12వేలు తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఐఫోన్ 17 కోసం వేచి ఉంటారా?

iPhone 16 Pro
iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఐఫోన్ 16 సిరీస్‌లో అత్యంత పాపులర్ మోడల్ ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ ఐఫోన్ (iPhone 16 Pro) ఆకర్షణీయమైన స్పెక్స్, ట్రిపుల్ కెమెరా సిస్టమ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.
అమెజాన్ అందించే ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్ అసలు వదులుకోవద్దు. ఈ ఆపిల్ ఐఫోన్ మోడల్ స్పెసిఫికేషన్లు, ధరతో ఏకంగా రూ. 12వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఇంతకీ, ఈ ఐఫోన్ 16 ప్రో మోడల్ కొనుగోలు చేయాలా? ఐఫోన్ 17 ప్రో కోసం వేచి ఉండాలా అనేది ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రోను అమెజాన్ నుంచి రూ.1,11,900కు కొనుగోలు చేయవచ్చు. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.1,19,900కు పొందవచ్చు. బ్లాక్ టైటానియం, డెసర్ట్ టైటానియం, నేచురల్ టైటానియం కలర్ ఆప్షన్లకు ధర ఒకేలా ఉంటుంది.
అంతేకాకుండా, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వైట్ టైటానియం కలర్ వేరియంట్ రూ.1,10,900కు లభిస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంకులు, కార్డులతో అదనంగా రూ.3వేలు తగ్గింపును కూడా పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (iPhone 16 Pro) :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌పై iOS 18పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. 3582mAh బ్యాటరీతో పాటు 25W మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఐఫోన్ 16 ప్రో కొనాలా? వద్దా? :
ఐఫోన్ 17 ప్రో మరో రెండు నెలల్లో రాబోతోంది. ఐఫోన్ 17 అద్భుతమైన అప్‌గ్రేడ్‌లతో లాంచ్ కానుంది. మొత్తం మూడు 48MP సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్, కొత్త ప్రాసెసర్ ఉన్నాయి. మీరు మెరుగైన స్పెషిఫికేషన్ల కోసం చూస్తుంటే.. దాదాపు రూ.20వేలకు పైగా ఎక్కువ బడ్జెట్ పెడితే ఐఫోన్ 17 ప్రో కొనేసుకోవచ్చు. లేదంటే కొంచెం తక్కువ ధర కలిగిన ఆపిల్ ఫోన్ కోసం చూస్తుంటే ఇప్పుడే ఐఫోన్ 16 ప్రో కొనేసుకోవడం బెటర్..