Vi 5G Services : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈరోజు నుంచే 5G సర్వీసులు.. రూ. 299 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ డేటా మీకోసం..!
Vi 5G Services : వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ 5జీ సర్వీసుల కోసం రూ. 200 రీఛార్జ్ ప్లాన్ కూడా అందిస్తోంది.

Vi 5G Services
Vi 5G Services : భారత మార్కెట్లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) 5G నెట్‌వర్క్ సర్వీసులను ప్రారంభించింది. ముందుగా జైపూర్‌లో 5G సర్వీసులను ప్రవేశపెట్టింది. జూలై 23 నుంచి నగరంలోని Vi కస్టమర్లు తమ 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లలో నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసు పొందవచ్చు.
భారత టెలికం మార్కెట్లో 23 నగరాల్లో 5Gని విస్తరించాలనే లక్ష్యంగా వోడాఫోన్ ఐడియా విస్తృత ప్రణాళికలు చేపట్టింది. 17 ప్రాధాన్యత గల టెలికాం సర్కిల్‌లను కవర్ చేసే దిశగా Vi 5G విస్తరిస్తోంది. 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ.299 నుంచి రీఛార్జ్ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
299 ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్ 5G డేటా :
కొత్త లాంచ్ ఆఫర్‌లో భాగంగా ప్రముఖ టెలికాం కంపెనీ రూ. 299 రీఛార్జ్ ప్లాన్‌లపై వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లు కస్టమర్‌లు ఆన్‌లైన్ లైవ్ గేమింగ్, రియల్-టైమ్ క్లౌడ్ యాక్సెస్, ఫాస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్ (హై క్వాలిలీ మూవీలు)తో పాటు హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌ను వేగంగా యాక్సస్ చేయొచ్చు.
5G కోసం ఎరిక్సన్‌తో Vi భాగస్వామ్యం :
జైపూర్‌లో 5G సర్వీసు కోసం AI-ఆధారిత మౌలిక సదుపాయాలను అందించేందుకు వోడాఫోన్ ఐడియా (Vi) ఎరిక్సన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెల్ఫ్-ఆర్గనైజింగ్ నెట్‌వర్క్‌ల (SON) ఉపయోగం మెరుగైన కవరేజ్, ట్రాఫిక్ రద్దీ నెట్‌వర్క్ పర్ఫార్మెన్స్ ఆటోమాటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది.
“జైపూర్‌లో Vi 5G సర్వీసులు ప్రారంభించిన సందర్భంగా పింక్ సిటీకి కనెక్టివిటీని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా నెక్స్ట్ జనరేషన్ 5G, 4G నెట్‌వర్క్‌తో వినియోగదారులకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వొడాఫోన్ ఐడియా ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ అన్నారు.
రాజస్థాన్‌లో 4G సర్వీసులు అప్‌గ్రేడ్ :
2024లో ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) తర్వాత వోడాఫోన్ ఐడియా రాజస్థాన్ అంతటా 4G నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది. ఇండోర్ కవరేజ్ కోసం 2700+ సైట్లలో 900MHz స్పెక్ట్రమ్ విస్తరించింది. 2వేలకు పైగా సైట్లలో 2100MHz స్పెక్ట్రమ్ సామర్థ్యం విస్తరించింది. 2500కి పైగా సైట్‌లకు 2100MHz స్పెక్ట్రమ్‌ను ఏర్పాటుచేసింది. ఈ అప్‌గ్రేడ్‌లు రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ వినియోగదారులకు స్టేబుల్, హై-స్పీడ్ కనెక్టివిటీని అందిస్తుంది.