BMC Budget: రికార్డ్ స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ముంబై మున్సిపాలిటీ.. దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువే
బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నదాని ప్రకారం.. 3,545 కోట్ల రూపాయలను కోస్టర్ రోడ్ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. 1,060 కోట్ల రూపాయలను కోరేగావ్-ముల్లుండ్ రోడ్డు కోసం కేటాయించారు. 2,825 కోట్ల రూపాయలను ట్రాఫిక్ నియంత్రణకు కేటాయించారు. ఇకపోతే, దేశంలోని దాదాపు పది రాష్ట్రాల కంటే కూడా బీఎంసీ బడ్జెట్ ఎక్కువ. మరికొన్ని రాష్ట్రాలకు సమీపంలో ఈ బడ్జెట్ ఉంటుంది.
- tony bekkal
- Updated on- May 24, 2023 / 11:39 AM IST
Mumbai Civic Body Presents Over ₹ 50,000 Crore Budget
BMC Budget: దేశంలో అత్యంత ధనిక మున్సిపలిటీ అయిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ మొట్టమొదటిసారి 50 వేల కోట్ల రూపాయలు దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శనివారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మొత్తంగా 52,619.07 కోట్ల రూపాయల బడ్జెట్‌ను పరిపాలనా విభాగం ప్రవేశ పెట్టింది. గతేడాదితో పోల్చుకుంటే 14.52 శాతం ఎక్కువ బడ్జెట్ ఈసారి ప్రతిపాదించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 45,949.2 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు.
Telangana Assembly : దేశానికి కేసీఆర్ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి : కేటీఆర్
కార్పొరేటర్ల పదవీకాలం ముగియడంతో పరిపాలనా విభాగమే తాజా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్‌ను మున్సిపల్ కమిషనర్ ఇక్బార్ సింగ్ చాహల్‌కు అందజేశారు. 1985 తర్వాత బీఎంసీలో ఇలా పరిపాలనా విభాగమే బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. ఈ విషయమై చాహల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘బీఎంసీ చరిత్రలో ఇదొక మైలు రాయి. మొదటిసారి బీఎంసీ బడ్జెట్ 50 వేల కోట్ల రూపాయలు దాటింది’’ అని అన్నారు. కాగా ఇందులో 27,247.80 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కాగా, 25,305.94 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయంగా నిర్ణయించారు.
Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు