మైహోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్.. తెల్లాపూర్ టెక్నో సిటీలో ఆగస్టు 11న లాంచ్
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అక్రిద ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దబోతోంది మైహోమ్ గ్రూప్. తెల్లాపూర్ టెక్నో సిటీలో ఆగస్టు 11న ప్రాజెక్ట్ లాంచ్ కాబోతోంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : August 9, 2024 / 12:07 PM IST
my home tellapur project akrida to luach on august 11
my home akrida project: తెలంగాణ దిగ్గజ రియాల్టీ సంస్థ మైహోమ్ గ్రూప్ నుంచి అక్రిద పేరుతో హైదరాబాద్‌లో మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది. తెల్లాపూర్ టెక్నో సిటీలో ఆగస్టు 11న ప్రాజెక్ట్ లాంచ్ కాబోతోంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అక్రిద ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దబోతోంది మైహోమ్ గ్రూప్. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసిన మైహోమ్ గ్రూప్.. ప్రతిమా గ్రూప్‌తో కలిసి అక్రిద ప్రాజెక్ట్‌ను డెవలప్ చేస్తోంది. ఎక్కడా రాజీపడకుండా, తమ కస్టమర్లకు కావాల్సిన అన్ని ఎమినిటీస్‌ని ఈ సంస్థ అందిస్తోంది.
రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులను కలిగివున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ఈ నెల 11న లాంచ్ అవుతోంది. జాయ్ అండ్ హ్యాపీనెస్ అనుభూతిని పొందాలనుకునే వారు ఈ ప్రాజెక్ట్‌లో కచ్చితంగా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని మైహోమ్ గ్రూప్ చెబుతోంది. మై హోమ్ అక్రిదలో ప్రాపర్టీని బుక్ చేసుకోవాలనుకునే వారు అడ్వాన్స్ పేమెంట్ కింద రెండున్నర లక్షల రూపాయలను చెల్లించాలి. బుకింగ్ చేసుకున్న 30 రోజుల్లోగా అడ్వాన్స్‌తో కలిపి ప్రాపర్టీ విలువలో 10 శాతం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: హైదరాబాద్‌లో మరో టాలెస్ట్ టవర్.. 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిద
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఓల్డ్ ముంబై హైవేకు కూతవేటు దూరంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అక్రిద ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిదను డెవలప్ చేస్తోంది. 81 శాతం ఓపెన్ ఏరియాతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ డిజైన్ చేశారు. ఇందులో మెుత్తం 12 హైరైజ్ టవర్స్‌ను నిర్మించనున్నారు.
