New Car vs Used Car : కొత్త కారు కొనాలా? పాత కారు కొనాలా? మీ డబ్బుకు ఏది బెస్ట్ ఛాయిస్?
New Car vs Used Car : కొత్త కారు కొనాలా? సెకండ్ హ్యాండ్ కారు కొనాలా? ధర, వారంటీ, మెయింట్‌నెన్స్ ఖర్చులు, సేఫ్టీ, కొనుగోలు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీ బడ్జెట్‌కు సరైన కారును ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- October 14, 2026 / 05:20 PM IST
New Car vs Used Car
- కొత్త కారు కొంటే నష్టమా? పాత కారు కొంటే లాభమా?
- మీ బడ్జెట్ ధరలో పాత కారు కొంటే బెనిఫిట్స్ ఏంటి?
- ధర ఒక్కటే కాదు.. ఈ ఖర్చులూ గుర్తుంచుకోండి
New Car vs Used Car : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొందరు కొత్త కార్లు కొంటారు, మరికొందరు పాత కార్లు కొంటారు. మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, పాత కారు కొనాలా? కొత్త కారు కొనాలా? ముందు డిసైడ్ అవ్వండి.
కొత్త కారులో లేటెస్ట్ ఫీచర్లు, వారంటీ ఉంటాయి. పాత కారులో మాత్రం తక్కువ ధరకు మంచి మోడల్‌ను సొంతం చేసుకోవచ్చు. మరి మీ బడ్జెట్ ధరలో (New Car vs Used Car) అవసరాలకు ఏది సరిపోతుంది? కారు కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
కొత్త కారు.. టెన్షన్ తక్కువ :
కొత్త కారు కొనడం వల్ల ప్రధానంగా అన్ని సరిగా ఉంటాయి.. గతంలో కారు ఎలా వాడారో? ఏమైనా సమస్యలు ఉన్నాయో అనే ఆందోళన ఉండదు. కంపెనీ వారంటీ కూడా లభిస్తుంది. దీంతో వారంటీ పరిధిలోకి వచ్చే కొన్ని రిపేరింగ్ ఖర్చుల నుంచి రిలీఫ్ పొందవచ్చు.
అంతేకాదు, మీ అవసరాలకు తగిన మోడల్, వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఎయిర్‌బ్యాగులు, పార్కింగ్ కెమెరాలు, మోడ్రాన్ సేఫ్టీ ఫీచర్లు వంటివి పరిశీలించవచ్చు. కారును ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడాలని అనుకుంటే కొత్త కారు బెస్ట్ ఆప్షన్. అయితే, కొత్త కారు ధరతోనే ఖర్చు పూర్తికాదు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర పెరుగుతుంది. కొనుగోలు చేశాక కారు వాల్యూ తగ్గడం కూడా మరొకటి తెలుసుకోవాలి.
ధర తక్కువ.. ఎక్కువ బెనిఫిట్ :
మీ బడ్జెట్ తక్కువగా ఉంటే పాత కారు బెస్ట్ ఆప్షన్. కొత్త కారు ధరకు దగ్గరగా ఉండే బడ్జెట్లోనే అద్భుతమైన ఫీచర్లు, ఎక్కువ స్పేస్ ఉన్న పాత మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా రెండు నుంచి నాలుగేళ్లు నడిచిన కార్లలో మంచి కండిషన్లో ఉన్న వాహనాలు దొరకొచ్చు. అయితే, తక్కువ ధర చూసి వెంటనే కొనుగోలు చేయొద్దు.. కారు బయటకు బాగానే కనిపించినా, ఇంజిన్ లేదా గేర్‌బాక్స్‌లో సమస్యలు ఉండే అవకాశం ఉంది.
Read Also : iPhone 17 Deal : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.99,900 ఐఫోన్ 17 ఇప్పుడు రూ.49,161కే..
కొనేముందు నమ్మకమైన మెకానిక్‌తో కారును పూర్తిగా చెక్ చేయించండి. ఇంజిన్, బ్రేకులు, టైర్లు, బ్యాటరీ, ఏసీ, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చెక్ చేయండి. యాక్సిండెట్ హిస్టరీ, వరద నీటి వల్ల జరిగిన నష్టం వంటి అంశాలను కూడా తెలుసుకోండి.
ధర ఒక్కటే కాదు.. ఈ ఖర్చులూ గుర్తుంచుకోండి :
పాత కారు కొనేటప్పుడు కొనుగోలు ధరతో పాటు రిపేర్లు, సర్వీసింగ్, టైర్ల మార్పు వంటి ఖర్చులకు కూడా బడ్జెట్ కేటాయించాలి. సర్వీస్ రికార్డులు, ఓడోమీటర్ రీడింగులు, ఇన్సూరెన్స్ వివరాలు, పొల్యూషన్ సర్టిఫికెట్‌ను చెక్ చేయాలి. అలాగే వాహన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పెండింగ్ లోన్లు, ఇతర బకాయిల వివరాలను చెక్ చేయాలి. కారు కొనుగోలు తర్వాత యాజమాన్య బదిలీ, ఇన్సూరెన్స్‌లో పేరు మార్పు వంటివి తప్పక పూర్తి చేయండి.
మీకు ఏ కారు సరిపోతుంది? :
లాంగ్ టైమ్ వినియోగం, వారంటీ, కొత్త ఫీచర్లు కావాలంటే కొత్త కారు కొనడమే బెటర్. తక్కువ బడ్జెట్లో మంచి మోడల్ కావాలంటే పూర్తి చెక్ చేయించిన సెకండ్ హ్యాండ్ కారును ఎంచుకోవచ్చు. చివరగా, కారు ధరను మాత్రమే కాకుండా నిర్వహణ ఖర్చులు, మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. అప్పుడే మీ డబ్బుకు సరైన కారును ఎంచుకోగలరు.
