New FASTag Pass : నవంబర్ 1 నుంచి కొత్త FASTag రూల్స్.. రూ.1,500 పాస్ ఎవరికి వర్తిస్తుందో తెలుసా?

New FASTag Pass : 2026 నవంబర్ 1 నుంచి కొత్త లోకల్ ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి రానుందా? ఏడాదికి రూ.1,500 లేదా రూ.3వేలు ఫీజు, అర్హతలు, పాస్ వర్తించే టోల్ ప్లాజాల వివరాలివే..

New FASTag Pass 2026

  • నవంబర్ 1 నుంచి కొత్త FASTag పాస్..
  • ఏడాదికి రూ.1,500తో టోల్ ఖర్చులకు చెక్
    కొత్త ఫాస్టాగ్ పాస్‌తో డబ్బులు ఆదా

New FASTag Pass : హైవేపై తరచూగా వెళ్తుంటారా? మీకో గుడ్ న్యూస్.. నేషనల్ హైవేలపై రోజూ రాకపోకలు సాగించే వాహనదారులకు నిజంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.. టోల్ ప్లాజాల దగ్గర ప్రతిసారీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు..

కొత్త లోకల్ ఫాస్టాగ్ పాస్ విధానం అమల్లోకి రానుంది. 2026 నవంబర్ 1 నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నట్లు సమాచారం.. అయితే, దీనికి సంబంధించిన అధికారిక నిబంధనలు, అప్లికేషన్ వివరాలను ముందుగానే వెరిఫై చేసిన తర్వాతే అప్లయ్ చేయడం బెటర్..

ఏడాదికి రూ.1,500 లేదా రూ.3వేలు :
కొత్త విధానం ప్రకారం.. టోల్ ప్లాజా ఉన్న ప్రాంతాన్ని బట్టి పాస్ ధర మారుతుంది. పట్టణ పరిధికి వెలుపల ఉన్న టోల్ ప్లాజాలకు ఏడాదికి రూ.1,500, మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములను ప్రతి ఏటా ఏప్రిల్ 1న సమీక్షించే అవకాశం ఉంది..

Read Also : Amazon Diwali Discount : దీపావళి బంపర్ ఆఫర్.. ఈ 5G ఫోన్ ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!

ఎవరికి ఈ పాస్ బెనిఫిట్..? :
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన వాహనదారులు ఈ పాస్ పొందవచ్చు. అయితే, వ్యక్తిగత అవసరాల కోసం రిజిస్టర్ చేసిన ప్రైవేట్ వాహనం అయి ఉండాలి. అలాగే, వాహనానికి చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాలి. రోజూ ఆఫీసులకు వెళ్లేవారు, స్థానికంగా ప్రయాణాలు చేసేవారికి కొంతవరకు ఖర్చు తగ్గించే అవకాశం కల్పిస్తుంది..

అన్ని టోల్ ప్లాజాల్లో వర్క్ అవుతుందా? :
ఈ పాస్ తీసుకున్నంత మాత్రాన దేశంలోని అన్ని టోల్ ప్లాజాల్లో ప్రయాణించవచ్చని అనుకోవద్దు.. ఏ టోల్ ప్లాజా కోసం పాస్ జారీ చేస్తారో అక్కడ మాత్రమే వర్తిస్తుంది. కొన్ని నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై అమల్లో ఉన్న స్పెషల్ టోల్ వసూలు విధానాలకు ఈ పాస్ వర్తించకపోవచ్చు..

నార్మల్ ఫాస్టాగ్ వార్షిక పాస్‌తో తేడా ఏంటి? :
సాధారణ వార్షిక ఫాస్టాగ్ పాస్ అర్హత ఉన్న వాహనాలకు నిర్దేశిత నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వర్తిస్తుంది. ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కానీ, లోకల్ పాస్ మాత్రం నిర్దిష్ట టోల్ ప్లాజా పరిధిలో నివసించే అర్హులైన వారికి మాత్రమే వర్తిస్తుంది. పాస్ కోసం అప్లయ్ చేసే ముందు అధికారిక గెజిట్ నోటిఫికేషన్, అర్హతలు, ఫీజులు, అప్లికేషన్ విధానాన్ని సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయండి..