Oakter Studio AC 5000 : రూ.14,499కే ఓక్టర్ కొత్త AC తెచ్చుకోండి.. ఫాస్ట్ కూలింగ్, తక్కువ పవర్ బిల్లు..!

Oakter Studio AC 5000 : కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? ఓక్టర్ భారత మార్కెట్లో కొత్త స్టూడియో ఏసీ 5000 (2026)ను లాంచ్ చేసింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Oakter Studio AC 5000

  • ఓక్టర్ కొత్త 0.5 టన్ విండో ఏసీ లాంచ్
  • ఇన్వర్టర్ ఆధారిత కూలింగ్ టెక్నాలజీ
  • తక్కువ పవర్, తక్కువ సౌండ్‌తో ఏసీ

Oakter Studio AC 5000 : అసలే సమ్మర్ సీజన్.. ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇంట్లో ఏసీ, కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి. సీజన్ కావడంతో మార్కెట్లోకి కొత్త ఏసీలు వచ్చేస్తున్నాయి. చాలామంది విండో ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎంత వాడిన పవర్ బిల్లు తక్కువ వచ్చే అనేక ఏసీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లోకి (Oakter Studio AC 5000) ఓక్టర్ నుంచి కొత్త స్టూడియో ఏసీ 5000 (2026) వచ్చేసింది. ఈ కొత్త 0.5 టన్ విండో ఏసీ తక్కువ పవర్ వినియోగం, ఇన్వర్టర్ ఆధారిత కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. కంపెనీ ఈ కొత్త 0.5-టన్ విండో ఏసీని చిన్న గదులు, స్టూడియో అపార్ట్‌మెంట్లు, కాంపాక్ట్ వర్క్‌స్పేస్‌ల కోసం అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తక్కువ పవర్.. ఎక్కువ కూలింగ్ :
పాత ఫిక్స్‌డ్-స్పీడ్ కంప్రెసర్ మోడల్ స్థానంలో ఈ కొత్త మోడల్‌లో ఇన్వర్టర్ ఆధారిత కూలింగ్ టెక్నాలజీని అందిస్తోంది. ఈ కొత్త ఏసీ తక్కువ పవర్ వినియోగంతో ఎక్కువ కూలింగ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. విండో ఏసీ పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..

Read Also : Samsung Galaxy S25 5G : వారెవ్వా.. శాంసంగ్ ఆఫర్ అదిరింది.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

ఓక్టర్ స్టూడియో ఏసీ 5000 (2026) ప్రారంభ ధర రూ. 14,499, జీఎస్టీతో వస్తుంది. కంపెనీ వెబ్‌సైట్, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకారం.. ఈ మోడల్ 75 చదరపు అడుగుల వరకు గదుల కోసం రూపొందించింది. కొత్త స్టూడియో ఏసీ 5000 ఇన్వర్టర్ ఆధారిత కూలింగ్ సిస్టమ్‌ అందిస్తుంది.

సాధారణ విండో ఏసీలతో పోలిస్తే.. ఈ టెక్నాలజీ అత్యంత స్మూత్ కూలింగ్‌, ఎక్కువ పవర్ ఆదా చేస్తుందని ఓక్టర్ చెబుతోంది. ఈ ఏసీ సుమారుగా 500W పరవ్ వినియోగిస్తుందని అంటోంది. అంటే.. ఒక యూనిట్ పవర్ సుమారు 2 గంటల్లో వినియోగించవచ్చని పేర్కొంది. ఇక ఈ ఏసీ మెయింట్ నెన్స్ ఖర్చు గంటకు సుమారు రూ. 4 ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ మోడల్ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది.

డిజైన్ పరంగా పరిశీలిస్తే..
ఈ ఏసీ సుమారు 22కి.గ్రాల బరువు ఉంటుంది. కాంపాక్ట్ షేప్ అందిస్తుంది. సాధారణ 6A హౌస్ పవర్ సాకెట్‌పై వాడొచ్చునని కంపెనీ పేర్కొంది. అంతేకాదు.. 1200VA ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్‌పై కూడా రన్ అవుతుంది. మీ ఇంట్లో ఇప్పటికే ఉన్న వైరింగ్‌ను మార్చాల్సిన అవసరం ఉండదు.

ఓక్టర్ కొత్త ఏసీలో యాంటీ-డస్ట్ ఫిల్టర్, తక్కువ సౌండ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఈ కంపెనీ CWRC కూలింగ్ సిస్టమ్‌ అందిస్తుంది. ఏసీ యూనిట్ నుంచి వాటర్ లీక్ తగ్గిస్తుంది.

అన్ని సీజన్లలో కూడా అద్భుతమైన కూలింగ్ అందించేలా ఈ ఏసీని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. వినియోగదారులు బాక్స్‌లో రిమోట్ కంట్రోల్, మౌంటింగ్ ఫ్రేమ్‌ను కూడా పొందవచ్చు. వారంటీ విషయానికి వస్తే.. ఏసీకి ఒక ఏడాది, కంప్రెసర్‌కు 5 ఏళ్ల వారంటీ అందిస్తుంది.