Tata Tiago EV Facelift : కొంటే ఇలాంటి కారు కొనాలి.. టాటా టియాగో ఈవీ కొత్త వెర్షన్‌ అదుర్స్.. సింగిల్ ఛార్జ్‌పై 285 కి.మీ రేంజ్!

Tata Tiago EV Facelift : టియాగో ఈవీ ధర రూ. 6.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్ ధర రూ. 4.69 లక్షలు, దీనికి అదనంగా కిలోమీటరుకు రూ. 2.60 అద్దె చెల్లించాలి.

Tata Tiago EV Facelift

  • ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో డిజైన్ మార్పులు, మరెన్నో కొత్త ఫీచర్లు
  • టియాగో ఈవీ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.99 లక్షలు
  • ఈ కారులో క్యాబిన్ రెండు కలర్ థీమ్‌ ఆప్షన్లు

Tata Tiago EV Facelift : టాటా లవర్స్‌కు పండగే.. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్‌లో భారీ వాటాతో టాటా మోటార్స్ టియాగో ఈవీ కొత్త వెర్షన్‌ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో డిజైన్‌లో మార్పులు, మరికొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. టియాగో ఈవీ ధర రూ. 6.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొత్త వెర్షన్ 19.2kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్ (Tata Tiago EV Facelift) ఆప్షన్‌లతో వస్తుంది. గత కొన్ని వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈవీ (EV) అమ్మకాలు కూడా అదే రేంజ్‌లో పెరిగాయి. మీడియా నివేదిక ప్రకారం.. టియాగో ఈవీ ధర రూ. 6.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌కు రూ. 4.69 లక్షలు ఖర్చవుతుంది. దీనికి అదనంగా కిలోమీటరుకు రూ. 2.60 అద్దె రుసుము ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుత డిజైన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వెర్షన్‌ పోలి ఉంటుంది.

Read Also : Nothing Phone 4a Pro : ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ. 50వేల నథింగ్ 5G ఫోన్ జస్ట్ రూ. 40,374కే..!

సింగిల్ ఛార్జ్‌పై 285కి.మీ రేంజ్ :
అయితే, టియాగో ఈవీ కొత్త వెర్షన్ డిజైన్‌లో మార్పు చేసింది. ఫ్రంట్ సైడ్ అదే కలర్ స్కీమ్‌తో క్లోజ్డ్-ఆఫ్ ప్యానెల్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొత్త వెర్షన్ 19.2kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తుంది. భారీ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై సుమారు 285 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

టియాగో ఈవీ హెడ్‌ల్యాంప్‌లు సన్నగా ఉండి ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి. కొత్తగా డిజైన్, మోడ్రాన్ కనిపించే బంపర్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డోర్లపై షార్క్ ఫిన్ యాంటెన్నా, టాటా ఈవీ బ్రాండింగ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొత్త కనెక్టెడ్ ఎల్ఈడీ ల్యాంప్, టెయిల్‌గేట్‌పై గ్లాస్-బ్లాక్ స్ట్రిప్ ఉన్నాయి.

మొత్తం 6 కలర్ ఆప్షన్లలో :
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. టియాగో ఈవీ అప్‌డేట్ డాష్‌బోర్డ్‌తో వస్తుంది. క్యాబిన్ డ్యూయల్-టోన్ థీమ్‌తో వస్తుంది. మెయిన్ మార్పు ఏమిటంటే.. రెండు ఫ్రీ-స్టాండింగ్ డిజిటల్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆటో-ఫోల్డింగ్ ORVMs, డ్యూయల్ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జర్‌లు, స్టోరేజ్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఎయిర్ ఫిల్టర్, రియర్ ఏసీ వెంట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లలో 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.