Electric Bikes : పెట్రోల్, డీజిల్ కష్టాలే ఉండవు.. ధూమ్ ధూమ్ అంటూ దూసుకెళ్లే లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్స్..!
Electric Bikes : పెట్రోల్ బైకులెందుకు బ్రో.. ఎలక్ట్రిక్ బైకులు తీసుకోండి.. ఇక పెట్రోల్, డీజిల్ కష్టాలే ఉండవు.. ధూమ్ ధూమ్ అంటూ లాంగ్ రైడ్ దూసుకెళ్లే బైకులు మీకోసమే.. ఏ బైకు ఎంత రేంజ్ ఇస్తాయంటే?
- Sreehari A
- Published On : March 25, 2026 / 02:44 PM IST
Electric Bikes
- పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో నిలబడాల్సిన పనిలేదు
- ఫ్యూయిల్ టెన్షన్ ఉండదు.. బంకులకు పరిగెత్తాల్సిన పనిలేదు
- చేతిలో ఎలక్ట్రిక్ బైకు ఉంటే ఎక్కడికైనా వెళ్లి రావొచ్చు
- ఇంట్లోనే ఛార్జ్ పెట్టుకోవచ్చు.. లాంగ్ డ్రైవ్ చేయొచ్చు
Electric Bikes : ఆఫీసుకు వెళ్లాలి.. ఏదైనా పని మీద అర్జెంట్ గా బయటకు వెళ్లాలి? బైకు బయటకు తీస్తే అందులో పెట్రోల్ లేదు.. ఇంకేముంది బంకు దగ్గరకు అతి కష్టం మీద లాక్కెళ్తే.. నో పెట్రోల్, డీజిల్ స్టాక్ అంటూ బోర్డులు కనిపిస్తే ఎలా అనిపిస్తుంది? కోపం మాత్రం పీక్ స్టేజ్ కు వెళ్తుంది కదా..
ఇప్పుడు దేశమంతా ఇదే పరిస్థితి కనబడుతోంది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్దకు వెళ్తే భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఫ్యూయిల్ దొరకుతుందన్న గ్యారెంటీ లేదు. టైమ్, మనీ రెండూ వేస్ట్ అవుతుంది.
సాధారణంగా పెట్రోల్, డీజిల్ షార్టేజీ రూమర్స్ వచ్చినప్పుడల్లా ప్యానిక్ పెరుగుతుంది. ఇలాంటి టెన్షన్ మనకెందుకు భయ్యా.. ఈ ఫ్యూయిల్ కష్టాలు ఎవరు పడతారులే.. హాయిగా ఎలక్ట్రిక్ బైక్ కొనేసుకుంటే బెటర్ కదా అనిపిస్తోందా?
ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ బైకులు అద్భుతమైన ఆప్షన్‌గా చెప్పవచ్చు. రాత్రి ఇంట్లోనే ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఉదయం ఎలాంటి క్యూలు లేకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. చేతిలో ఎలక్ట్రిక్ బైకు ఉంటే ఆ కిక్కే వేరబ్బా.. అనిపిస్తుంది..
ఎలక్ట్రిక్ బైకుల విషయానికి వస్తే.. మార్కెట్లో సరసమైన ధరలో మంచి ఆఫర్లతో లభ్యమవుతున్నాయి. ప్రత్యేకించి లాంగ్ రేంజ్ దూసుకెళ్లే అద్భుతమైన ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి.
అందులో ఓలా రోడస్టర్ ఎక్స్ ప్లస్ వంటి బైకులు 500కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. లాంగ్ ట్రావెల్‌కు బెస్ట్ బైక్. అలాగే, అల్ట్రావయలెట్ F77 మాచ్ 2 స్పోర్ట్స్ ఫీలింగ్‌తో 300 కి.మీ పైగా రేంజ్ అందిస్తుంది. డైలీ వాడకానికి ఓలా రోడస్టర్ సరిగ్గా సరిపోతుంది.
శ్రీవారు ప్రాణ 2.0 స్టైలిష్ ఎలక్ట్రిక్ బైకు అదిరిపోయే డిజైన్‌తో పాటు మంచి రేంజ్ అందిస్తుంది. ఈవీ బైకుల ధరలు, ఈఎంఐలు కూడా మీ బడ్జెట్ రేంజ్‌లోనే అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే లాంగ్ టైమ్ సేవింగ్ చేయొచ్చు. ఇకపై బంకుల వద్ద వెయిటింగ్ అవసరం ఉండదు. సింపుల్ గా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుని మళ్లీ ధూమ్ ధూమ్ అంటూ లాంగ్ డ్రైవ్ దూసుకెళ్లిపోవచ్చు..
ఓలా రోడస్టర్ ఎక్స్ ప్లస్ (లాంగ్ రేంజ్ కింగ్) :
ప్రస్తుతం అత్యధిక రేంజ్ ఇచ్చే బైక్‌లలో ఓలా రోడస్టర్ ఎక్స్ ప్లస్ ఒకటి. 4.5kWh బ్యాటరీతో 252కి.మీ, 9.1kWh వేరియంట్‌తో 501కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 125kmph ద్వారా హైవే రైడ్స్‌కు కూడా సూట్ అవుతుంది.
ధర సుమారు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.89 లక్షల వరకు ఉంటుంది. ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ యాప్ వంటి హైటెక్ ఆప్షన్లు ఉన్నాయి. ఈఎంఐ సుమారు రూ. 3,500 నుంచి రూ.5వేల మధ్య ఉండొచ్చు. లాంగ్ జర్నీకి బెస్ట్ బైక్..
అల్ట్రావయోలెట్ F77 మ్యాచ్ 2 : (హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ ఈవీ)
ఈ అల్ట్రావయోలెట్ F77 మ్యాచ్ 2 బైక్ స్పీడ్, పవర్ విషయానికి వస్తే.. 323కి.మీ వరకు రేంజ్ అందించే టాప్ వేరియంట్. ఈ బైకు స్పెషాలిటీ టాప్ స్పీడ్ 150+kmph రేంజ్ అందిస్తుంది. ధర పరంగా రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.99 లక్షల మధ్య ఉంటుంది. స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్ ఇస్తుంది. ఈఎంఐ సుమారు రూ. 7వేల నుంచి రూ. 9వేల వరకు ఉండొచ్చు. ప్రీమియం లుక్, పవర్ కావాలంటే కొనేసుకోవచ్చు.
ఓలా రోడస్టర్ (బ్యాలెన్స్‌డ్ మిడ్‌రేంజ్ ఈవీ) :
సాధారణ యూజర్లకు ఈ బైక్ బెస్ట్ ఆప్షన్. సుమారు 151–190కి.మీ రేంజ్ ఇస్తుంది. ధర రూ. 1.05 లక్షల నుంచి రూ. 1.40 లక్షల మధ్య ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్, రైడ్ మోడ్‌లు, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈఎంఐ రూ.2,500 నుంచి రూ.4వేల మధ్య ఉండొచ్చు. డైలీ కమ్యూట్‌కు బెస్ట్ బైక్..
ఓలా రోడస్టర్ ఎక్స్ (బడ్జెట్ ఫ్రెండ్లీ) :
ఈ బైక్ ఎంట్రీ లెవెల్ యూజర్లకు అద్భుతంగా ఉంటుంది. 117–200కి.మీ వరకు రేంజ్ ఉంటుంది. ధర రూ. 85,000 నుంచి రూ. 1.05 లక్షల వరకు ఉంది. ఇటీవల ఆఫర్లతో రూ. 79,999 వరకు తగ్గింది. ఈఎంఐ రూ.2వేల నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఈవీ బైకు కొనాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
శ్రీవారు ప్రాణ 2.0 (స్టైలిష్ – ప్రాక్టికల్ ఈవీ ) :
ఈ ఎలక్ట్రిక్ బైక్ సుమారు 250 కి.మీ రేంజ్ ఇస్తుంది. స్టైలిష్ డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీ హైలైట్ అని చెప్పొచ్చు. ధర సుమారు రూ. 2 లక్షల దగ్గర ఉంటుంది. ఈఎంఐ రూ. 4,000 నుంచి రూ.6,000 మధ్య ఉండొచ్చు. లాంగ్ రేంజ్, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.
ఫైనల్‌గా చెప్పాలంటే.. పెట్రోల్ ఖర్చులు, మెయింటెనెన్స్ టెన్షన్, పొల్యూషన్ తగ్గించుకోవాలంటే ఎలక్ట్రిక్ బైకులు కొనడమే బెస్ట్. ముఖ్యంగా రోజువారీ ప్రయాణం కోసమైనా లేదా లాంగ్ రైడ్ కోసం చూస్తుంటే ఓలా రోడస్టర్ ఎక్స్ ప్లస్ వంటి మోడల్స్ అద్భుతంగా ఉంటాయి.
