×
Ad

Senior Citizen Loans : సీనియర్ సిటిజన్లకు రిటైర్ అయ్యాక బ్యాంకులు లోన్లు ఇస్తాయా? డబ్బులు అవసరమైతే ఎలా? ఎమర్జెన్సీ లోన్ ఫుల్ గైడ్

Senior Citizen Loans : మీరు రిటైర్ అయ్యారా? మీకు డబ్బు అవసరం పడిందా? సాధారణంగా సీనియర్ సిటిజన్లకు లోన్ వస్తుందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published On : February 19, 2026 / 08:11 PM IST

Senior Citizens

  • సీనియర్ సిటిజన్లు లోన్లు ఎలా పొందవచ్చు ఎమర్జెన్సీ లోన్లు ఇస్తారా?
  • సీనియర్ సిటిజన్లలో లోన్ అప్లయ్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని
  • పెన్షన్ ఉన్నా కూడా రిటైర్ అయినా ఎమర్జెన్సీ లోన్ ఎలా పొందాలి?
  • సీనియర్ సిటిజన్లకు బెస్ట్ లోన్ ఆప్షన్స్ 2026 ఏంటి?

Senior Citizen Loans : సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ తర్వాత సాధారణ జీతం ఆగిపోతుంది. అయితే, ఖర్చులు మాత్రమే అలాగే ఉంటాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు రిటైర్మెంట్ భారీగా పెరుగుతాయి. కొన్నిసార్లు, రిటైర్మెంట్ ఫండ్స్ కూడా సరిపోవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా సీనియర్ సిటిజన్లు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలని భావిస్తుంటారు.

అయితే, రిటైర్మెంట్ తర్వాత బ్యాంకు నుంచి లోన్ పొందడం చాలా కష్టం. ఎందుకంటే వారికి ఆ సమయంలో ఎలాంటి ఆదాయం ఉండదు. మీరు రిటైర్మెంట్ చేశాక ఏదైనా డబ్బు అవసరమైతే, ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసా? అయితే ఏయే మార్గాల్లో సులభంగా అవసరానికి రుణాన్ని పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పెన్షనర్ల కోసం పర్సనల్ లోన్ :
మీ పెన్షన్ క్రమం తప్పకుండా మీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అవుతుందా? ఆయా బ్యాంకు నుంచి మీకు వ్యక్తిగత రుణం పొందవచ్చు. మీకు దీర్ఘకాలంగా అదే బ్యాంకులో పెన్షన్ తీసుకుంటే మాత్రం రుణం పొందడం చాలా ఈజీ. అయితే, మీకు తక్కువ రుణమే వస్తుంది. కాలపరిమితి కూడా చాలా తక్కువగా ఉండవచ్చు. చాలా బ్యాంకులు అడ్వాన్స్ పేమెంట్ విధిస్తాయి. వడ్డీ రేటు ఎక్కువగా ఉండవచ్చు.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రూ. లక్ష డిపాజిట్ చాలు.. కేవలం వడ్డీనే రూ.45వేలు సంపాదించుకోవచ్చు!

ఫిక్స్‌డ్ డిపాజట్లు (FD)పై లోన్ :
మీకు బ్యాంక్ FD ఉందా? మీరు బ్యాంకు నుంచి ఈజీగా లోన్ తీసుకోవచ్చు. మీరు FDని రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఈ రుణంపై వడ్డీ రేటు FDల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పేపర్ వర్క్ కూడా తక్కువే. మీరు మీ బ్యాంక్ FDలో 80శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.

ఆస్తిపై రుణం :
మీకు ఇల్లు లేదా ఆస్తి ఉందా? పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే ఆస్తిపై రుణం తీసుకోవచ్చు. బ్యాంకుకు భద్రత ఉంటుంది. వడ్డీ రేటు వ్యక్తిగత రుణం కన్నా తక్కువగా ఉంటుంది. అయితే, కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీ రుణాలను సకాలంలో చెల్లించకపోతే మీ ఇల్లును బ్యాంకు స్వాధీనం చేసుకోవచ్చు.

బంగారంపై లోన్ :
సీనియర్ సిటిజన్లు లేదా రిటైర్ అయిన వారు కూడా బంగారంపై లోన్లు తీసుకోవచ్చు. మీరు బంగారాన్ని తాకట్టు పెట్టడం ద్వారా త్వరగా రుణం పొందవచ్చు. వడ్డీ రేటు సాధారణంగా అన్‌సెక్యూర్డ్ రుణాల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించకపోతే మీ బంగారాన్ని వేలం వేయొచ్చు.