PhonePe UPI 123Pay : నో స్మార్ట్‌ఫోన్.. నో ఇంటర్నెట్.. డేటా లేకున్నా డబ్బులు పంపుకోవచ్చు.. ఫీచర్ ఫోన్లలో ఫోన్‌పే UPI సర్వీసు..

PhonePe UPI : ఫోన్‌పే భారతీయ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం UPI 123Pay సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫీచర్ ఫోన్‌ల నుంచి యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. ఈ సర్వీసు SMS ద్వారా వర్క్ అవుతుంది.

PhonePe UPI 123Pay

  • ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్లు
  • ఫోన్‌పే UPI 123Pay సర్వీసును ప్రారంభించిన ఫోన్‌పే
  • 20 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ కస్టమర్లకు భారీ బెనిఫిట్స్

PhonePe UPI : స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు.. ఇంటర్నెట్ అంతకన్నా అవసరం లేదు.. చేతిలో ఫీచర్ ఫోన్ ఉన్నా చాలు.. ఇకపై ఈజీగా యూపీఐ పేమెంట్లు ఈజీగా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సరిగా లేని ప్రాంతాల్లో కూడా ఈజీగా ఫాస్ట్ యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ లేని ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది.

అదే.. ఫోన్‌పే కొత్త యూపీఐ సర్వీసు (123Pay).. ఈ సర్వీసు ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ప్రకారం.. SMS ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. డబ్బు పంపడానికి లేదా మర్చంట్ పేమెంట్లు చేసేందుకు ఇకపై ఇంటర్నెట్ అవసరం ఉండదు.

ఇప్పటికీ ఫీచర్ ఫోన్‌లను వాడేవారికి లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాలలో నివసించే వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. ఫోన్‌పే (PhonePe UPI 123Pay) ప్రకారం.. భారత్‌లో 20 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారుఈ కొత్త సర్వీసు ద్వారా యూపీఐ సిస్టమ్ మరింత అందుబాటులోకి రానుంది.

యూపీఐతో పేమెంట్లు :
ఫోన్‌పే యూపీఐ 123పే ద్వారా ఒకరి నుంచి మరొకరికి డబ్బు పంపుకోవచ్చు. మర్చంట్లకు పేమెంట్లు చేయడం, బ్యాంకు బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం, గత లావాదేవీల వివరాలను చూడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేసుకోవచ్చు. భవిష్యత్తులో బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్‌లు, ఆధార్ ఆధారిత యూపీఐ రిజిస్ట్రేషన్‌లను కూడా ఈ సర్వీసులను చేర్చాలని కంపెనీ యోచిస్తోంది.

ఏ ఫీచర్ ఫోన్‌లకు సపోర్టు :
ప్రస్తుతం ఫోన్‌పే ఈ సర్వీసు కొన్ని ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లలో లభిస్తోంది. HMD 105 2G, HMD 110 2G, నోకియా 105 క్లాసిక్, నోకియా 105 సింగిల్ సిమ్, నోకియా 105 డ్యూయల్ సిమ్, నోకియా 106 నోకియా 123 షీల్డ్ వంటి ఫోన్‌లలో సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Read Also : Upcoming Smartphones : సెప్టెంబర్ స్మార్ట్‌ఫోన్ జాతర! మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ లిస్ట్ ఇదే!

అంతేకాదు.. రాబోయే నెలల్లో HMD నోకియా మరికొన్ని మోడళ్లు కూడా ఈ సర్వీసును సపోర్ట్ చేయవచ్చు. ప్రారంభంలో ఈ ఫీచర్ HMD, నోకియా, లావా ఇంటర్నేషనల్ ఐటెల్ మొబైల్ ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లలో అందుబాటులో ఉంటుందని ఫోన్‌పే తెలిపింది.

వాయిస్ ద్వారా హెల్ప్‌లైన్‌ సౌకర్యం :

యూజర్ల కోసం ఫోన్‌పే ఏఐ-ఆధారిత వాయిస్ హెల్ప్‌లైన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ సర్వీసు ఇంగ్లీషుతో సహా 12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. యూపీఐ 123పేను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో యూజర్లకు దశలవారీ సూచనలు అందిస్తుంది. అంతేకాదు.. ఈ వాయిస్ హెల్ప్‌లైన్ యూపీఐకి సంబంధించిన సాధారణ ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేస్తుంది.

యూపీఐ 123Pay ఎలా? :

  • మీ ఫీచర్ ఫోన్‌లో PhonePe యాప్‌ ఓపెన్ చేయండి.
  • నిబంధనలు షరతులను అంగీకరించి బ్యాంకును ఎంచుకోవాలి.
  • డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలను కార్డ్ ఎక్స్ పెయిర్ డేట్ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత UPI PINను జనరేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టే
  • మొబైల్ నంబర్, కాంటాక్ట్ లేదా UPI ID ద్వారా డబ్బు పంపవచ్చు.

ఫీచర్ ఫోన్‌కు కెమెరా ఉంటే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా పేమెంట్లు చేయవచ్చు. ఈ పేమెంట్ చేసే సమయంలో యూజర్ పర్సనల్ వివరాలను వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తాన్ని ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయొచ్చు. ఇందుకోసం యూపీఐ పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.

ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా :
ఈ సర్వీసు అతిపెద్ద బెనిఫిట్ ఏమిటంటే.. సాధారణ ఇంటర్నెట్ కనెక్షన్ అక్కర్లేదు. పేమెంట్లు SMS ద్వారా జరుగుతాయి. వీక్ నెట్‌వర్క్‌లు లేదా లిమిట్ 2G కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.