×
Ad

Nothing Phone 2 Pro : వాలెంటైన్స్ డే సేల్.. నథింగ్ ఫోన్ 2 ప్రో భారీ తగ్గింపు.. కేవలం రూ. 16,999కే..!

Nothing Phone 2 Pro : నథింగ్ ఫోన్ 2 ప్రో ధర భారీగా తగ్గింది. వాలెంటైన్స్ డే సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 2 ప్రో కేవలం రూ.16,999కే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 11, 2026 / 10:05 PM IST

Nothing Phone 2 Pro

  • నథింగ్ ఫోన్ 2 ప్రో రూ. 22,999కి లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌ వాలెంటైన్స్ డే సేల్‌ ధర రూ.17,999కే
  • నెలకు రూ. 852 చొప్పున 24 నెలల ఈఎంఐ ప్లాన్‌
  • క్రెడిట్ కార్డ్‌తో కొనుగోళ్లపై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్

Nothing Phone 2 Pro : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ వాలెంటైన్స్ సేల్‌ ప్రకటించింది. ప్రస్తుతం అనేక ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. వాలెంటైన్స్ డే రోజున కొత్త ఫోన్‌ కొనేవారికి అద్భుతమైన అవకాశం.

గత ఏడాది ఏప్రిల్‌లో నథింగ్ ఫోన్ 2 ప్రో లాంచ్ అయింది. ఈ ఫోన్ స్టయిల్, అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులో ఉంది. మీరు నథింగ్ ఫోన్ 2 ప్రో కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

నథింగ్ ఫోన్ 2 ప్రోపై డీల్స్ : 
భారత మార్కెట్లో ఫస్ట్ రూ. 22,999కి లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2 ప్రో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ వాలెంటైన్స్ డే సేల్‌లో కేవలం రూ.17,999కే లభ్యమవుతోంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే ఈ డీల్ వర్తిస్తుంది. అంటే మొత్తం 4 కలర్ ఆప్షన్‌లపై కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది.

Read Also : Vivo T4 5G Price : అద్భుతమైన డిస్కౌంట్.. వివో T4 5G ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 20వేలకే.. ఎలాగంటే?

బ్యాంక్ డీల్స్ :
కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోళ్లపై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. నథింగ్ ఫోన్ 2 ప్రో కేవలం రూ.16,999కి తగ్గుతుంది. మీ దగ్గర ఈ కార్డ్ లేకపోతే కంపెనీ మరికొన్ని బ్యాంక్ కార్డ్‌లపై దాదాపు రూ. 500 డిస్కౌంట్‌ అందిస్తోంది.

ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు :
మీ పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ చేస్తే.. కొత్త ఫోన్‌పై రూ. 17,400 వరకు సేవ్ చేయొచ్చు. నెలకు రూ. 852 చొప్పున 24 నెలల ఈఎంఐ ప్లాన్‌ ఎంచుకోవచ్చు. మొత్తంగా మీరు రూ. 20,436 చెల్లించాల్సి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 2 ప్రో, ఫీచర్లు :
నథింగ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.77-అంగుళాల 120Hz అమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. 8GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. కెమెరా కాన్ఫిగరేషన్ బ్యాక్ సైడ్ (50MP + 50MP + 8MP)తో వస్తుంది. అలాగే, 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని అందిస్తుంది.