UPI MDR Charges: పండగ వేళ వ్యాపారులకు గుడ్ న్యూస్.. యూపీఐ ఛార్జీల పెంపు వాయిదా.. కేంద్రం కీలక ప్రకటన

పండగ సీజన్‌లో వ్యాపారులకు ఊరటనిస్తూ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల(UPI MDR Charges) అమలును ఎన్‌పీసీఐ దీపావళి తర్వాతకు వాయిదా వేసింది.

Npci postpones upi mdr charges for merchants till after diwali festive

UPI MDR Charges: దీపావళి పండగ సీజన్‌ సందర్భంగా దేశంలోని చిన్న, పెద్ద వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భారీ ఊరట కల్పించాయి. యూపీఐ (UPI) లావాదేవీలపై విధించాలనుకున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (UPI MDR Charges) ఛార్జీల అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి అక్టోబర్ 15 నుంచే ఈ ఛార్జీలు అమల్లోకి రావాల్సి ఉండగా, పండగ వేళ వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

Indiramma Towers: తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. ఇక జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్.. కేవలం రూ.4 లక్షలకే..

వ్యాపారుల ఆందోళన.. స్పందించిన స్టీరింగ్ కమిటీ:

డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీల ప్రతిపాదనను హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా వ్యాపారాలు జోరుగా సాగే పండగ సీజన్‌లో ఈ ఫీజుల వల్ల తమ లాభాలు తగ్గిపోతాయని ఎన్‌పీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న స్టీరింగ్ కమిటీ, ఈ ఛార్జీల అమలును దీపావళి ముగిసే వరకు నిలిపివేసింది. ఎండీఆర్ అమలుకు సంబంధించి కొత్త, కచ్చితమైన తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఎన్‌పీసీఐ వివరించింది.

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే యూపీఐ సేవలు:

ఎన్‌పీసీఐ ఖరారు చేసిన ముందస్తు నిబంధనల ప్రకారం.. రూ. 2,000 దాటిన పి-టు-ఎమ్ (P2M) వ్యాపార చెల్లింపులపై మాత్రమే 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. అయితే, సాధారణ వినియోగదారులకు (P2P), రూ. 2,000 లోపు చేసే వ్యాపార లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని, అవి ఎప్పటిలాగే పూర్తిగా ఉచితమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పండగ షాపింగ్ సమయంలో డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదని వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.