Ola S1Z Electric Scooter : బడ్జెట్‌లో బిగ్ రేంజ్.. Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ..!
Ola S1Z Electric Scooter : రూ. 79,999 ప్రారంభ ధరతో ఓలా S1Z ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. 301 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. 5.1 kWh బ్యాటరీ, 4 kW మోటార్, స్మార్ట్ ఫీచర్ల పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- August 29, 2026 / 04:43 PM IST
Ola S1Z Electric Scooter
- రూ. 79,999కే కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
- తక్కువ ధర.. ఎక్కువ రేంజ్..
- ఓలా సొంత టెక్నాలజీ, 2 బ్యాటరీ ఆప్షన్లలో
Ola S1Z Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఓలా అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఈ కొత్త ఓలా S1Zను బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ముఖ్యంగా ధర కన్నా రేంజ్ హైలెట్ అని చెప్పాలి. భారీ బ్యాటరీ వేరియంట్ ఏకంగా 301 కి.మీ IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
రూ. 79,999 నుంచి స్టార్ట్ :
ఓలా S1Z రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 3.1kWh వేరియంట్ ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్). ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 179 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. ఈ వేరియంట్ డెలివరీలు డిసెంబర్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక 5.1kWh వేరియంట్ ధర రూ. 99,999. స్పెషాలిటీ 301 కి.మీ ఐడీసీ రేంజ్ అందిస్తుంది. ఈ మోడల్ డెలివరీలు మార్చి 2027 నుంచి ప్రారంభమవుతాయి.
భారత్ సెల్స్.. ఓలా సొంత టెక్నాలజీ :
ఓలా డెవలప్ చేసిన S1Z కొత్త ఎలక్ట్రిక్ ఈవీలో 46-సిరీస్ LFP బ్యాటరీ సెల్స్ అందిస్తుంది. కంపెనీ బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్‌లో డెవలప్ చేసి గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు వేరియంట్లలోనూ 4kW పీక్ పవర్ మోటార్, 70kmph టాప్ స్పీడ్ ఉన్నాయి. 3.1kWh మోడల్ 0-40 kmphను 4.6 సెకన్లలో, 5.1 kWh వెర్షన్ 4.9 సెకన్లలో అందుకుంటుంది.
ఫీచర్లతో ఫుల్ ప్యాక్ :
ఈ కొత్త ఓలా ఈవీ స్కూటర్ MoveOS 5, క్రూజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, GPS, రీజెనరేటివ్ బ్రేకింగ్, OTA అప్‌డేట్స్, ఓలా యాప్ ద్వారా జియో-ఫెన్సింగ్, టైమ్-ఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇరుకైన ప్రదేశాల్లో స్కూటర్‌ను ఈజీగా పార్క్ చేసేందుకు ఈజీ పార్క్ ఫీచర్ కూడా ఉంది. మొత్తానికి, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్, సొంత బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లతో ఓలా S1Zను బడ్జెట్ ఈవీ సెగ్మెంట్‌లో అదిరిపోయే కొత్త ఛాయిస్‌గా మార్చాయి.
