OnePlus 13 Price : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 10వేలు తగ్గింపుతో వన్‌ప్లస్ 13 కొనేసుకోండి..!

OnePlus 13 Price : వన్‌ప్లస్ 13 ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13 Price : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 10వేలు తగ్గింపుతో వన్‌ప్లస్ 13 కొనేసుకోండి..!

OnePlus 13 Price

Updated On : May 25, 2025 / 6:24 PM IST

OnePlus 13 Price : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో భారీ తగ్గింపు ధరకే వన్‌ప్లస్ 13 (OnePlus 13 Price) లభిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో ఇలా ఇన్వెస్ట్ చేస్తే అన్ని లాభాలే.. రూ. లక్ష పెట్టుబడితో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

వన్‌ప్లస్ 13 ఫోన్‌ను ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. రూ. 72,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ వన్‌ప్లస్ ఫోన్ మోడల్ రూ. 10వేల కన్నా ఎక్కువ తగ్గింది. తద్వారా రూ. 63వేల లోపు ధరలోనే మార్కెట్లో లభ్యమవుతుంది.

వన్‌ప్లస్ 13 ఆఫర్లు, ఎక్స్చేంజ్ :
ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో వన్‌ప్లస్ 13 రూ.69,999కు అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. రూ.2,500 కార్పొరేట్ డిస్కౌంట్‌తో ధర రూ.62,499 వరకు తగ్గింపు పొందవచ్చు.

పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 7వేలు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. నెలకు రూ. 5,833 చొప్పున 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ, జియోతో 10 OTTకి 6 నెలల ఫ్రీ ప్రీమియం యాక్సెస్, వన్‌ప్లస్ డిస్‌ప్లే కోసం లైఫ్ టైమ్ వారంటీ, ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13లో HDR10+ సపోర్ట్‌తో 6.82-అంగుళాల LTPO 3K డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. హుడ్ కింద ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : iPhone 16 Pro : ఐఫోన్ యూజర్లకు పండగే.. ఐఫోన్ 16ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.