OnePlus 13R Price : వావ్.. సూపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 13Rపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

OnePlus 13R Price : వన్‌ప్లస్ 13R ధర తగ్గింది. అమెజాన్‌లో ఈ వన్‌ప్లస్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13R price drop

OnePlus 13R Price : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూ్స్.. ఈ ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ 13R ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వన్‌ప్లస్ ధర రూ.36,999 కన్నా తక్కువ (OnePlus 13R Price) ధరకే పొందవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డిస్కౌంట్ అసలు మిస్ చేసుకోవద్దు.

ఈ వన్‌ప్లస్ ఫోన్ అమోల్డ్ డిస్‌ప్లే, గత ఏడాదిలో స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరాలు, అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో లేని ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా ఉంది. ఈ వన్‌ప్లస్ 13R ధర రూ. 42,999కి లాంచ్ కాగా ఇప్పుడు తగ్గింపు ధరకు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో వన్‌ప్లస్ 13R డీల్ :
ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ 13R ధర రూ.39,999కు తగ్గింది. లాంచ్ ధరపై రూ.3వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,250 డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 33,050 ఎక్స్ఛేంజ్ వాల్యూతో పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Ultra : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ అల్ట్రాపై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ డోంట్ మిస్..!

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13R ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్‌ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఈ వన్‌ప్లస్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 13R ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0తో వస్తుంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 13R ఫోన్ డస్ట్, నీటి నిరోధకతకు IP65 సర్టిఫికేషన్‌తో వస్తుంది. అలాగే, అక్వా టచ్ 2.0 ఫీచర్ కూడా ఉంది. తడిగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. గ్లోవ్ మోడ్ కూడా ఆకట్టుకునేలా ఉంది.