Samsung Galaxy S24 Ultra : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ అల్ట్రాపై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ డోంట్ మిస్..!

Samsung Galaxy S24 Ultra : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర లాంచ్ ధర నుంచి రూ. 50వేలు తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 Ultra : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ అల్ట్రాపై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ డోంట్ మిస్..!

Samsung Galaxy S24 Ultra

Updated On : August 9, 2025 / 5:29 PM IST

Samsung Galaxy S24 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతతం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ధర భారీగా తగ్గింది. ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో (Samsung Galaxy S24 Ultra) గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు బెస్ట్ ఆఫర్. అమెజాన్ ఇండియాలో శాంసంగ్ గెలాక్సీS24 ధర లాంచ్ ధర రూ. 1,29,999 నుంచి ఏకంగా రూ. 50వేలు తగ్గింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 79,999కు లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ ఫోన్ రూ.81,960కి లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ధర దాదాపు రూ.48వేలకు తగ్గింది. ఈ డీల్‌లో ఫ్లాట్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ కేవలం లిమిట్ టైమ్ మాత్రమే.

అమెజాన్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) రూ. 1,29,999 ధరకు లాంచ్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు అమెజాన్‌లో రూ. 79,999‌కు పొందవచ్చు. ఇంకా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 4,150 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అదనపు వడ్డీ లేకుండా యూజర్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా వర్కింగ్ కండిషన్, మోడల్‌ను బట్టి అమెజాన్ రూ. 47,150 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Read Also : Raksha Bandhan 2025 : రక్షా బంధన్ స్పెషల్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ కోసం AI ఇమేజ్‌లను జనరేట్ చేసే 5 బెస్ట్ ఫ్రీ యాప్స్..!

ఫ్లిప్‌కార్ట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో (Samsung Galaxy S24 Ultra) శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ. 81,960కి లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 48,039 డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో రూ. 4వేల వరకు సేవ్ చేయొచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ. 13,660 ఈఎంఐతో ఎంచుకోవచ్చు. పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ ద్వారా డివైజ్ వర్కింగ్ కండిషన్, మోడల్‌ను బట్టి ఫ్లిప్‌కార్ట్ రూ. 66,100 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా భారీ అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తుంది. 6.8-అంగుళాల QHD+ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కర్వ్ డిజైన్ నుంచి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఏడాదిలో అల్ట్రా మోడల్స్ టైటానియం ఛాసిస్‌ను కలిగి ఉండవచ్చు. అల్యూమినియం ఫ్రేమ్ కూడా ఉండొచ్చు. మార్బుల్ గ్రే, కోబాల్ట్ వైలెట్, ఒనిక్స్ బ్లాక్, అంబర్ ఎల్లో ఆరెంజ్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ వంటి ప్రత్యేక ఆప్షన్లు 4 ప్రామాణిక కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో గెలాక్సీ S24 అల్ట్రా 65W వద్ద స్పీడ్ ఛార్జింగ్ కలిగి ఉంది. 100x స్పేస్ జూమ్ ఫీచర్‌ 5x పెరిస్కోప్ జూమ్ యూనిట్‌తో 200MP కెమెరా కలిగి ఉంది. ఇమేజ్ పోస్ట్-ప్రాసెసింగ్, 4K రిజల్యూషన్‌లో 120fps వీడియోను రికార్డ్ చేయగలదు.