OnePlus Nord 4 : అద్భుతమైన డీల్.. కేవలం రూ. 25వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 4 సొంతం చేసుకోండి..!
OnePlus Nord 4 Price : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్‌పై అదిరే ఆఫర్.. బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

OnePlus Nord 4 Price
OnePlus Nord 4 : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర భారీగా తగ్గింది. క్రోమాలో ఈ ఫోన్ తక్కువ (OnePlus Nord 4 Price) ధరకే లభిస్తోంది. రూ.32,999 కు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.25వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
Read Also : Oppo K13x 5G : ఒప్పో K13x 5G వస్తోందోచ్.. ఈ నెల 23నే లాంచ్.. ధర, కీలక ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!
ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అందించే ఫోన్ కోసం చూస్తుంటే.. వన్‌ప్లస్ నార్డ్ 4 డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఈ హ్యాండ్‌సెట్ ఫుల్ మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంది.
హార్డ్‌వేర్, మంచి కెమెరా అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ నార్డ్ 5 డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వన్‌ప్లస్ నార్డ్ 4 ధర, ఆఫర్లు :
ప్రస్తుతం క్రోమాలో వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ రూ.29,499 ధరకు అందుబాటులో ఉంది. ధర రూ.3,500 తగ్గింపుతో పొందవచ్చు. కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.4,500 వరకు తగ్గింపు పొందచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ.24,999కి తగ్గుతుంది.
మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా ఈ ఫోన్ రూ.25,074 ధరకు కొనుగోలు చేయొచ్చు.
నెలకు రూ.4,166 నుంచి 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మెర్క్యురియల్ సిల్వర్, అబ్సిడియన్ మిడ్‌నైట్, ఒయాసిస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 4 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 6.74-అంగుళాల OLED ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,150 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది.
ఈ వన్‌ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌ను కలిగి ఉంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజీతో వస్తుంది. ఈ వన్‌ప్లస్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, అలర్ట్ స్లైడర్ అప్‌గ్రేడ్స్ కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.