Oppo K13x 5G : ఒప్పో K13x 5G వస్తోందోచ్.. ఈ నెల 23నే లాంచ్.. ధర, కీలక ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!

Oppo K13x 5G : ఒప్పో K13x 5G ఫోన్ లాంచ్ డేట్ ఇదిగో.. అద్భుతమైన ఫీచర్లతో ఈ నెల 23నే లాంచ్ కానుంది. ధర, కీలక ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి..

Oppo K13x 5G : ఒప్పో K13x 5G వస్తోందోచ్.. ఈ నెల 23నే లాంచ్.. ధర, కీలక ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!

Oppo K13x 5G

Updated On : June 16, 2025 / 4:38 PM IST

Oppo K13x 5G : కొత్త ఒప్పో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల చివరిలో ఒప్పో K13x 5G భారత మార్కెట్లో లాంచ్ (Oppo K13x 5G) కానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను ముందుగానే కంపెనీ వెల్లడించింది.

రూ. 15వేల కన్నా తక్కువ ధరకు లాంచ్ కానుంది. 4GB, 6GB ర్యామ్ వేరియంట్‌లలో రానుంది. కంపెనీ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ IP65 రేటింగ్, SGS గోల్డ్ డ్రాప్-రెసిస్టెన్స్, SGS మిలిటరీ స్టాండర్డ్, MIL-STD 810-H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌లతో వస్తుందని అంచనా..

ఒప్పో K13x 5G భారత్ లాంచ్ :
ఒప్పో K13x 5G ఫోన్ జూన్ 23న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఒప్పో ఫోన్ ధర రూ. 15వేల కన్నా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్ కలర్ ఆప్షన్‌లలో రానుంది.

ఒప్పో K13x 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుందని ఒప్పో వెల్లడించింది. 4GB, 6GB ర్యామ్ ఆప్షన్‌లలో 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్టుతో అందుబాటులో ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15తో వస్తుంది. గూగుల్ జెమినీ ఏఐ, సమ్మరీ, ఏఐ రికార్డర్, ఏఐ స్టూడియో వంటి ఇతర ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.

ఒప్పో K13x స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : 
ఒప్పో K13x 5G ఫోన్ 6,000mAh బ్యాటరీని (Oppo K13x 5G) 45W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 50MP ఏఐ బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ఏఐ ఎరేజర్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ క్లారిటీ ఎన్‌హాన్సర్ వంటి ఏఐ బ్యాక్డ్ ఇమేజింగ్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. రాబోయే ఒప్పో K13x 5G ఫోన్ హై-స్ట్రెంత్ అల్యూమినియం అల్లాయ్ మిడిల్ ఫ్రేమ్, 360-డిగ్రీల డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీతో వస్తుందని ఒప్పో వెల్లడించింది.

Read Also : Post Office : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ. 17 లక్షల రాబడి పక్కా..!

IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. MIL-STD 810-H షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు, SGS గోల్డ్ డ్రాప్-రెసిస్టెన్స్, SGS మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌లతో కూడా వస్తుంది. ఒప్పో K13x 5G ఫోన్ డిస్‌ప్లే స్ప్లాష్ టచ్, గ్లోవ్ టచ్ మోడ్‌తో పాటు క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌కు సపోర్టు ఇస్తుంది.