Post Office : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ. 17 లక్షల రాబడి పక్కా..!

Post Office : పోస్టాఫీసులో రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ.17 లక్షల వరకు రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Post Office : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ. 17 లక్షల రాబడి పక్కా..!

Post Office Scheme

Updated On : June 16, 2025 / 3:31 PM IST

Post Office : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? ప్రతి ఒక్కరూ ఆదాయంలో కొంత భాగాన్ని సేవ్ చేయాలనుకుంటారు. అలాగే మంచి రాబడిని పొందాలని భావిస్తుంటారు.

పోస్టాఫీసులో ప్రతిరోజూ రూ. 333 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 16 లక్షలకు పైగా జమ చేయవచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా భారీగా రాబడిని పొందవచ్చు.

Read Also : Google Pixel 9 Pro XL : ఇది కదా సూపర్ డీల్.. ఈ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. డోంట్ మిస్..!

10 ఏళ్లలో రూ. 16 లక్షలు సేవింగ్ :
పోస్టాఫీసులో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ పథకం కింద కేవలం 10 ఏళ్లలో రూ. 16 లక్షలకు పైగా సేవింగ్ చేయవచ్చు. అందులో రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా అద్భుతమైన వడ్డీని పొందవచ్చు.

రూ. 100తో అకౌంట్.. వడ్డీ ఎంతంటే? :
పోస్ట్ ఆఫీస్ ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (RD)లో నెలకు రూ. 100 పెట్టుబడి పెట్టడం ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం కూడా ఉంది. వడ్డీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ పథకంపై 6.7 శాతం కాంపౌండ్ వడ్డీ పొందవచ్చు. ఈ కొత్త వడ్డీ రేటు జనవరి 1, 2024 నుంచి వర్తిస్తుంది.

రిస్క్ లేని పెట్టుబడి :
పోస్టాఫీసులోని అన్ని పథకాలు రిస్క్ లేనివి. ఆర్‌డీ పెట్టుబడిలో ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడిపై ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ సేవింగ్ స్కీమ్ ప్రతి నెలా సరైన సమయంలో పెట్టుబడి పెట్టాలి.

ఎందుకంటే.. ఏదైనా నెలలో పెట్టుబడి మర్చిపోతే.. నెలకు ఒక శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వరుసగా 4 వాయిదాలను మిస్ అయితే.. ఈ అకౌంట్ ఆటోమాటిక్‌గా క్లోజ్ అవుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది.

పోస్టాఫీసులో పెట్టుబడి ఇలా.. :
పోస్టాఫీసులోని ఈ పిగ్గీ బ్యాంకులో పెట్టుబడి ద్వారా రూ. 16 లక్షలు పొందారు అనుకుంటే.. లెక్కింపు ప్రకారం.. ఈ పథకంలో రోజుకు రూ. 333 పెట్టుబడి పెడితే.. ఈ మొత్తం ప్రతి నెలా దాదాపు రూ. 10వేలు అవుతుంది.

ఇలా చేస్తే.. ప్రతి ఏడాదిలో రూ. 1.20 లక్షలు ఆదా చేస్తారు. 5 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో రూ. 6 లక్షలు జమ చేస్తారు. 6.7 శాతం చొప్పున చక్రవడ్డీని పరిశీలిస్తే.. అది రూ. 1,13,659 అవుతుంది. మీ మొత్తం రూ. 7,13,659 అవుతుంది.

Read Also : Realme Narzo 80 Lite 5G : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి నార్జో 80 లైట్ 5G వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..! 

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉండవచ్చు. మరో 5 ఏళ్లు కూడా పొడిగించవచ్చు. ఈ పిగ్గీ బ్యాంకును 10 ఏళ్ల వరకు సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇప్పుడు 10 ఏళ్లలో డిపాజిట్ మొత్తం రూ. 12లక్షలు అవుతుంది. దానిపై వచ్చే వడ్డీ రూ. 5,08,546 అవుతుంది. 10 ఏళ్ల తర్వాత వడ్డీతో మొత్తం రూ. 17,08,546 రాబడి పొందవచ్చు.

Note :  ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. పెట్టుబడి పెట్టే ముందు పోస్టాఫీసులో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.