Google Pixel 9 Pro XL : ఇది కదా సూపర్ డీల్.. ఈ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. డోంట్ మిస్..!

Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30వేలు ధర తగ్గింది..

Google Pixel 9 Pro XL : ఇది కదా సూపర్ డీల్.. ఈ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. డోంట్ మిస్..!

Google Pixel 9 Pro XL

Updated On : June 16, 2025 / 12:21 PM IST

Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం విజయ్ సేల్స్ (Google Pixel 9 Pro XL) పిక్సెల్ 9 ప్రో XLపై రూ. 30వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.

Read Also : Jio Annual Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. ఈ ప్లాన్‌తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ కాలింగ్, 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ OTT బెనిఫిట్స్..!

అధికారిక విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ డీల్ అందుబాటులో ఉంది. మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నా? లేదా మొదటిసారి పిక్సెల్‌ ఫోన్‌కు మారుతున్నా ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ రూ.1,24,999కు లాంచ్ అయింది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1,04,999కు లిస్ట్ అయింది.

రిటైలర్ పిక్సెల్ 9 ప్రో XLపై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.10వేల తగ్గింపును పొందవచ్చు.

పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, (Google Pixel 9 Pro XL) ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL లో (1344×2992) పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌ను అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. పిక్సెల్ 9 ప్రో XL ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x వరకు ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.

Read Also : Poco F7 Launch : అతిపెద్ద బ్యాటరీతో పోకో F7 ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. సింగిల్ ఛార్జ్‌తో 52 గంటలపైనే..!

సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం పిక్సెల్ ఫోన్ 42MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5060mAh బ్యాటరీని కలిగి ఉంది.