Google Pixel 9 Pro XL : ఇది కదా సూపర్ డీల్.. ఈ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. డోంట్ మిస్..!
Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30వేలు ధర తగ్గింది..
- Sreehari A
- Published On : June 16, 2025 / 12:21 PM IST
Google Pixel 9 Pro XL
Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్.. ప్రస్తుతం విజయ్ సేల్స్ (Google Pixel 9 Pro XL) పిక్సెల్ 9 ప్రో XLపై రూ. 30వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
అధికారిక విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ డీల్ అందుబాటులో ఉంది. మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నా? లేదా మొదటిసారి పిక్సెల్ ఫోన్‌కు మారుతున్నా ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ రూ.1,24,999కు లాంచ్ అయింది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1,04,999కు లిస్ట్ అయింది.
రిటైలర్ పిక్సెల్ 9 ప్రో XLపై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.10వేల తగ్గింపును పొందవచ్చు.
పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, (Google Pixel 9 Pro XL) ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL లో (1344×2992) పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌ను అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. పిక్సెల్ 9 ప్రో XL ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 5x వరకు ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం పిక్సెల్ ఫోన్ 42MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5060mAh బ్యాటరీని కలిగి ఉంది.
