Jio Annual Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. ఈ ప్లాన్‌తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ కాలింగ్, 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ OTT బెనిఫిట్స్..!

Jio Annual Plan : ఈ రీఛార్జ్ ప్లాన్‌తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ కాలింగ్, 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ OTT బెనిఫిట్స్ పొందవచ్చు.

Jio Annual Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. ఈ ప్లాన్‌తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ కాలింగ్, 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ OTT బెనిఫిట్స్..!

Jio Prepaid Plans

Updated On : June 16, 2025 / 10:48 AM IST

Jio Annual Plan : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. భారత అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (Jio Annual Plan) రిలయన్స్ జియో సరికొత్త వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది.

రూ. 3,599 విలువైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయిన యూజర్లకు ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.

కేవలం సింగిల్ రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా బెనిఫిట్స్, OTT బెనిఫిట్స్ పొందవచ్చు. ఇటీవల మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌లు పెరిగిన తర్వాత లాంగ్-వ్యాలిడిటీ ప్లాన్లు బాగా పాపులర్ అయ్యాయి. జియో వార్షిక ప్లాన్ మల్టీ డిజిటల్ బెనిఫిట్స్ అందిస్తోంది. తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.

Read Also : PAN Card : మీ పాన్ కార్డు పనిచేస్తుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. లేదంటే రూ. 10వేలు పెనాల్టీ కట్టాల్సిందే..!

జియో ప్లాన్‌ రూ. 3,599 : 
జియో (Jio Annual Plan) రూ. 3599 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు.

రోజుకు 100 SMS, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా చొప్పున ఏడాదికి 912.5GB వరకు పొందవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు.

రోజువారీ డేటా లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ డేటా ఏడాది వరకు అందిస్తుంది. నెలవారీ రీఛార్జ్‌‌పై తగినంత డేటా, OTT బెనిఫిట్స్ కోసం రూ. 3,599 వార్షిక ప్లాన్ ఎంచుకోవచ్చు. ఏడాది మొత్తం స్ట్రీమింగ్, ఎంటర్‌‌టైన్మెంట్ పొందవచ్చు.