PAN Card : మీ పాన్ కార్డు పనిచేస్తుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. లేదంటే రూ. 10వేలు పెనాల్టీ కట్టాల్సిందే..!

PAN Card : మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకున్నారా? పాన్ ఇన్‌యాక్టివ్ అయితే రూ. 10వేలు జరిమానా చెల్లించక తప్పదు..

PAN Card : మీ పాన్ కార్డు పనిచేస్తుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. లేదంటే రూ. 10వేలు పెనాల్టీ కట్టాల్సిందే..!

PAN Card holders

Updated On : June 15, 2025 / 6:05 PM IST

PAN Card : పాన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ అలర్ట్.. మీ పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్ అయిందా? ఎప్పుడైనా చెక్ (PAN Card) చేసుకున్నారా? లేదంటే వెంటనే చెక్ చేసుకోండి.. ఇన్ యాక్టివ్ పాన్ కార్డు అలానే వాడుతుంటే.. అప్రమత్తంగా ఉండండి.

ఇలాంటి పాన్ కార్డ్ హోల్డర్లపై ఆదాయపు పన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇన్ యాక్టివ్ పాన్ కార్డ్‌ను వాడినందుకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద రూ. 10వేల వరకు జరిమానా విధించవచ్చని ఆ శాఖ చెబుతోంది.

Read Also :  Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. చీపెస్ట్ జియో ప్లాన్ ఇదిగో.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా.. OTT బెనిఫిట్స్ కూడా..!

చాలా మంది పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డ్ ఇకపై చెల్లదని తెలియదు. ఎప్పటిలానే బ్యాంకింగ్, ఆర్థిక, ఆదాయపు పన్ను సంబంధిత పనులకు వాడేస్తుంటారు. కొన్నిసార్లు అనేక సమస్యలకు దారితీస్తుంది.

మీరు ఇంకా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే ఇప్పుడే లింక్ చేసుకోండి. మీ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అయి ఉండొచ్చు. ఫలితంగా చట్టపరమైన చర్యలు, జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత తొందరగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి.

టాక్స్ పేయర్లు జాగ్రత్త.. :
పాన్ కార్డు కేవలం ఆదాయపు పన్ను (PAN Card) రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి మాత్రమే కాదు.. బ్యాంకింగ్, పెట్టుబడి, ఆస్తి కొనుగోలు, అమ్మకం, రుణాలు తీసుకోవచ్చు. ఇతర ఆర్థిక లావాదేవీలకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.

ఎవరికైనా పాన్ కార్డ్ ఇన్‌‌యాక్టివ్ అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్ యాక్టివ్ అనే విషయం తెలియకుండా పన్నుచెల్లింపు కోసం ఉపయోగిస్తే.. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 272B కింద ఆయా వ్యక్తులపై రూ. 10వేల వరకు జరిమానా విధించవచ్చు.

ఎలా చెక్ చేయాలి? :
మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఈ డేటాను పొందవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ‘Verify Your Pan’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Read Also : Vivo T3 Pro : వివో లవర్స్‌కు పండగే.. వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. ఈ అద్భుతమైన డీల్ డోంట్ మిస్..!

మీ పాన్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాన్, ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. OTP ఎంటర్ చేశాక పాన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ పాన్ యాక్టివ్‌గా లేకపోతే.. వెంటనే ఆధార్‌కు లింక్ చేయండి.