Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. చీపెస్ట్ జియో ప్లాన్ ఇదిగో.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా.. OTT బెనిఫిట్స్ కూడా..!
Jio Cheapest Plan : జియో అత్యంత చౌకైన ప్లాన్.. రూ. 500 ప్లాన్లలో ఇదొకటి.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Reliance Jio
Jio Cheapest Plan : జియో యూజర్లకు పండగే.. రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన (Jio Cheapest Plan) రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది.
నెల వ్యాలిడిటీ నుంచి ఏడాది వ్యాలిడిటీ వరకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటాను అందిస్తోంది. అనేక OTT ప్లాన్‌లలో ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
కంపెనీకి రూ. 500 కంటే తక్కువ ధర ఉన్న అనేక ప్యాక్‌లు కూడా ఉన్నాయి మరియు వీటిలో కంపెనీ ప్రతిరోజూ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది.
రూ. 500 కంటే తక్కువ ఉన్న మూడు ప్లాన్‌లు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తాయి. అలాగే, ఈ ప్లాన్‌లో అనేక ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
2GB రోజువారీ డేటా :
జియో రూ.198 ప్లాన్ 2GB రోజువారీ (Jio Cheapest Plan) డేటాతో వస్తుంది. ప్రతిరోజూ 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఫ్రీ SMS పొందవచ్చు.
ఈ ప్లాన్ JioAICloud, JioTVలకు ఫ్రీ యాక్సెస్‌తో వస్తుంది. జియో వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ OTT ప్లాట్‌ఫామ్ ఫ్రీ సభ్యత్వాన్ని అందిస్తుంది.
ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా, ప్రతిరోజూ 100 ఫ్రీ SMSతో అన్‌లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. ఈ జియో ప్లాన్ 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. జియో ఏఐక్లౌడ్, జియోటీవీలను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్లాన్ ధర రూ. 349 ఉండగా, వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.
Read Also : iPhone 16 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో ధర.. ఈ క్రేజీ డీల్ అసలు మిస్ చేయొద్దు..!
రోజుకు 2GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ప్రతిరోజూ 100 ఫ్రీ SMS కూడా పొందవచ్చు. అనేక OTT ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
ఇందులో SonyLIV, Zee5, Discovery+, Sun NXT, CHAUPAL, Hoichoi వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ ప్లాన్ ధర రూ. 445కు పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.