Senior citizens Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే ప్రతినెలా రూ. 60వేలకు పైగా సంపాదించుకోవచ్చు!

Senior citizens Scheme : సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత నప్రతినెలా రూ. 60వేలకు పైగా సంపాదించుకోవచ్చు..

Senior citizens Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే ప్రతినెలా రూ. 60వేలకు పైగా సంపాదించుకోవచ్చు!

Senior citizens Scheme

Updated On : June 15, 2025 / 4:14 PM IST

Senior citizens Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ కోసం అనేక అద్భుతమైన పథకాలు (Senior citizens Scheme) అందుబాటులో ఉన్నాయి. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా ఒకటి. ఈ పథకం ద్వారా దీర్ఘకాలికంగా కోట్లాది డబ్బు ఆదా చేయొచ్చు. కానీ, PPF ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని కూడా పొందవచ్చు.

Read Also : Fake Financial Apps : ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ లోన్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

ప్రతి ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు PPFలో డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 7.1శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ కాంపౌండింగ్ ఆధారంగా పెరుగుతుంది. PPF మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు ఉంటుంది. 5 ఏళ్లు రెండుసార్లు పొడిగించి పెట్టుబడి పెట్టాలి.

25 ఏళ్ల పాటు రూ.1.5 లక్షల పెట్టుబడిని కొనసాగించాలి. 25 ఏళ్లలో రూ. 1 కోటి రాబడి వస్తుంది. 25 ఏళ్ల పాటు PPFలో ఏడాదికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మొత్తం పెట్టుబడి రూ.37,50,000 అవుతుంది. మీకు 7.1 శాతం రేటుతో రూ.65,58,015 వడ్డీ లభిస్తుంది. మీ PPF అకౌంటులో మొత్తం రూ.1,03,08,015 ఉంటుంది.

అకౌంటులో డబ్బు అలాగే ఉంచండి :
25 ఏళ్ల తర్వాత కూడా ఈ డబ్బును అకౌంట్ నుంచి విత్‌డ్రా చేయాల్సిన అవసరం లేదు. PPF అకౌంట్‌లోనే జమ చేయాలి.

మీరు ఇలా చేస్తే.. PPF అకౌంటులో ఎంత మొత్తం జమ అయినా PPF లెక్కింపు ప్రకారం.. వడ్డీ వస్తుంది. ఈ ఖాతా నుంచి కావలసినప్పుడు మొత్తాన్ని విత్‌డ్రా చేయొచ్చు. ఏడాదికి ఒకసారి మాత్రమే పాక్షికంగా విత్‌డ్రా చేయవచ్చు.

ప్రతినెలా రూ. 60వేలు రాబడి :
మీ ఖాతాలో జమ చేసిన రూ.1,03,08,015 మొత్తంపై 7.1శాతం రేటుతో వడ్డీగా రూ.7,31,869 లభిస్తుంది. ప్రతి ఏటా వడ్డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

రూ.7,31,868 మొత్తాన్ని 12 నెలల్లో డివైడ్ చేస్తే.. రూ.60,989 అవుతుంది. ప్రతి నెలా రూ.60,989 చొప్పున జమ అవుతుంది. ఆపై మొత్తంగా రూ.1,03,08,015 రాబడి అకౌంటులో జమ అవుతుంది.

Read Also : PM Kisan : గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత అప్పుడే.. రూ. 2వేలు పడతాయో లేదో తెలుసుకోండిలా..!

ఇలా PPF పొడిగించండి :
PPF అకౌంట్ మరో 5 ఏళ్లకు పొడిగించాలంటే మీరు అకౌంట్ ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు దరఖాస్తును సమర్పించాలి. మెచ్యూరిటీ తేదీ నుంచి ఏడాది పూర్తయ్యేలోపు ఈ దరఖాస్తును సమర్పించాలి. ఇలా PPF అకౌంట్ 25 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు.