PM Kisan : గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత అప్పుడే.. రూ. 2వేలు పడతాయో లేదో తెలుసుకోండిలా..!

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైతులు రూ. 2వేలు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు.

PM Kisan : గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత అప్పుడే.. రూ. 2వేలు పడతాయో లేదో తెలుసుకోండిలా..!

PM Kisan Yojana

Updated On : June 15, 2025 / 3:34 PM IST

PM Kisan Yojana : దేశంలోని కోట్లాది మంది పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా రూ. 6వేలు అందిస్తోంది. రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. గత ఫిబ్రవరిలో 19వ విడత విడుదల అయింది. పీఎం కిసాన్ 20వ విడత కూడా అతి త్వరలో విడుదల కానుంది.

Read Also : UPI Payments : యూపీఐ కొత్త రూల్స్.. ఈ నెల 16 నుంచి పేమెంట్లు వెరీ ఫాస్ట్.. కేవలం 10 సెకన్లలోనే..!

నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత జూన్ 20, 2025న రైతుల ఖాతాల్లో జమ కానుందని భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని గమనించాలి.

9 కోట్లకు పైగా (PM Kisan) రైతులు 20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారుల eKYC, ఆధార్ సీడింగ్, భూమి రికార్డుల ధృవీకరణ పూర్తయింది.

పీఎం కిసాన్ పథకం కింద అన్ని భూస్వామ్య రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. మొత్తం 3 సమాన వాయిదాలలో అందిస్తారు.

రైతులు తమ లబ్ధిదారుల స్టేటస్, పేమెంట్ అప్‌డేట్స్ పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)లో చెక్ చేయవచ్చు.

Read Also : Fake Financial Apps : ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ లోన్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

ఈ సైట్ వినియోగదారుల లబ్ధిదారుల జాబితాలో పేరును ధృవీకరించాలి. OTP ఆధారిత లేదా బయోమెట్రిక్ మెథడ్స్ ద్వారా eKYC పూర్తి చేయాలి.

లబ్ధిదారుల స్టేటస్ (PM Kisan) ఎలా చెక్ చేయాలి? :

  • https://pmkisan.gov.in విజిట్ చేయండి.
  • ‘Know Your Status’ లేదా ‘Beneficiary List’ పై క్లిక్ చేయండి.
  • ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
  • OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి
  • ఫుల్ eKYC
  • భూమి రికార్డులను వెరిఫై చేయండి.
  • ఆధార్-బ్యాంక్ లింక్ చేయండి.

కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక అప్‌డేట్ విడుదల చేయనుంది. పీఎం కిసాన్ రైతులు సాయం కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను చెక్ చేయాలి లేదా స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలి.