Fake Financial Apps : ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ లోన్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

Fake Financial Apps : ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫేక్ లోన్ యాప్స్ పట్ల జాగ్రత్త.. వెంటనే ఫైనాన్షియల్ యాప్స్ డిలీట్ చేయండి.

Fake Financial Apps : ఆండ్రాయిడ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ లోన్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

Fake Financial Apps

Updated On : June 15, 2025 / 2:43 PM IST

Fake Financial Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ఫైనాన్షియల్ యాప్స్ ‌‌(Fake Financial Apps) కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.

ఈ లోన్ యాప్‌లు చూసేందుకు లీగల్ అనిపించేలా ఉంటాయి.. కానీ, వినియోగదారుల ప్రమేయం లేకుండానే వారి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని దొంగిలిస్తుంటాయి. ప్రైవసీ, డేటా, ఫండ్స్ పరంగా నష్టపోవాల్సి వస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అల్ట్రా 5G ఫోన్ కొనేసుకోండి..!

ఈ మోసపూరిత లోన్ యాప్స్ చాలా వరకు విదేశీ సంస్థలకు చెందినవని అధికారులు గుర్తించారు. అందుకే ఈ లోన్ యాప్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారిక హ్యాండిల్ సైబర్ దోస్త్ ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఈ మోసపూరిత లోన్ యాప్‌ల జాబితాను సైబర్ దోస్త్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. సైబర్ దోస్ట్ ప్రకారం.. ఈ అప్లికేషన్‌లు వినియోగదారులను మోసం చేయడమే కాకుండా వారి డేటా, ఆర్థిక, ప్రైవసీని కూడా ప్రమాదంలో పడేస్తాయి. సైబర్ దోస్త్ ద్వారా లోన్ యాప్స్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం..

  • ఇన్‌వాయిసర్ ఎక్స్‌పర్ట్స్
  • లోన్ రైనా – ఇన్‌స్టంట్ లోన్ ఆన్‌లైన్
  • గుప్తా క్రెడిట్ – సేఫ్ అండ్ హ్యాండీ
  • గ్రానెట్‌స్విఫ్ట్
  • లోన్ క్యూ -ఫైనాన్సియల్ కాలిక్యులేటర్
  • క్రెడిట్ ఎడ్జ్
  • అల్టిమేట్ లెండ్
  • స్మార్ట్‌రిచ్ ప్రో
  • క్రెడిట్ లెన్స్
  • క్యాష్ లోన్ – ఈఎంఐ కాలిక్యులేటర్

సైబర్ దోస్త్ వినియోగదారుల కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

Read Also : UPI Payments : యూపీఐ కొత్త రూల్స్.. ఈ నెల 16 నుంచి పేమెంట్లు వెరీ ఫాస్ట్.. కేవలం 10 సెకన్లలోనే..!

యాప్ అథెంటికేషన్ తప్పనిసరిగా ధృవీకరించండి.
RBI ధృవీకరించిన లోన్ ప్లాట్ ఫాంలను మాత్రమే ఉపయోగించండి.
ఏదైనా వ్యక్తిగత డేటాను షేర్ చేసే ముందు వివరాలను అడిగి తెలుసుకోండి.