UPI Payments : యూపీఐ కొత్త రూల్స్.. ఈ నెల 16 నుంచి పేమెంట్లు వెరీ ఫాస్ట్.. కేవలం 10 సెకన్లలోనే..!
UPI Payments : యూపీఐ పేమెంట్లపై కొత్త రూల్ జూన్ 16 నుంచి అమల్లోకి రానుంది. కేవలం 10 సెకన్లలో పేమెంట్ పూర్తి కానుంది.

UPI Payments
UPI Payments : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్లపై కొత్త రూల్స్ వస్తోంది. ఈ నెల 16 నుంచి (UPI Payments) యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా పూర్తి కానున్నాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూజర్ల సౌకర్యం కోసం ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. NPCI వివిధ యూపీఐ సర్వీసులకు రెస్పాన్స్ టైమ్ తగ్గించింది.
ఈ కొత్త మార్పుతో వినియోగదారులు యూపీఐ సేవలను మరింత వేగంగా పూర్తి చేయొచ్చు. జూన్ 16 నుంచి యూపీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు NPCI ఒక సర్య్కూలర్ కూడా జారీ చేసింది.
NPCI సర్క్యులర్ ప్రకారం.. సాధారణంగా ఉపయోగించే యూపీఐ, ఏపీఐ రెస్పాన్స్ టైమ్.. లావాదేవీ స్టేటస్ చెక్ చేయడం, లావాదేవీ రివర్సల్ వంటివి మునుపటి 30 సెకన్ల నుంచి కేవలం 10 సెకన్లకు తగ్గించింది.
ఇకపై 15 సెకన్లు కాదు.. 10 సెకన్లలో :
అదనంగా, వాలిడేట్ అడ్రస్ (పేమెంట్, కలెక్ట్ ) యూపీఐ (UPI Payments) ఏపీఐ రెస్పాన్స్ టైమ్ కూడా 15 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గించింది.
దీనికి సంబంధించి మార్పులను వెంటనే అమల్లోకి తేవాలంటూ పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు, బ్యాంకులకు ఎన్‌పీసీఐ సూచనలు చేసింది.
ఈ కొత్త నిబంధనతో చెల్లింపుదారుల బ్యాంకులు, లబ్ధిదారుల బ్యాంకులు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు (PSP) భారీగా ప్రయోజనం పొందుతారు.
ఎందుకంటే.. యూపీఐ పేమెంట్స్ వేగంగా పూర్తి అవుతాయి. ఏదైనా ఫెయిల్ అయిన లావాదేవీలను రివర్స్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసేందుకు టర్నరౌండ్ టైమ్ ఇప్పుడు తగ్గుతుంది. 30 సెకన్లు కాస్త 10 సెకన్లకు తగ్గుతుంది.
Read Also : Father’s Day 2025 : హ్యాపీ ఫాదర్స్ డే.. మీ నాన్న కోసం రూ.10వేల లోపు ధరలో అద్భుతమైన టెక్ గిఫ్ట్స్ ఇవ్వొచ్చు!
ఉదాహరణకు.. మీరు ఏదైనా యూపీఐ పేమెంట్ చేస్తే.. ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్నే రెస్పాన్స్ టైమ్ అంటారు. కొన్నిసార్లు ఈ టైమ్ లేట్ అవుతుంది.
ఆ తర్వాతే ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటినుంచి ఆ సమయం కేవలం 10 సెకన్లలోనే పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.