Father’s Day 2025 : హ్యాపీ ఫాదర్స్ డే.. మీ నాన్న కోసం రూ.10వేల లోపు ధరలో అద్భుతమైన టెక్ గిఫ్ట్స్ ఇవ్వొచ్చు!

Father’s Day 2025 : ఫాదర్స్ డే నాడు మీ నాన్నకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సర్‌‌ప్రైజ్ చేయొచ్చు.. ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా?

Father’s Day 2025 : హ్యాపీ ఫాదర్స్ డే.. మీ నాన్న కోసం రూ.10వేల లోపు ధరలో అద్భుతమైన టెక్ గిఫ్ట్స్ ఇవ్వొచ్చు!

Father’s Day 2025

Updated On : June 15, 2025 / 1:04 PM IST

Father’s Day 2025 : జూన్ 15 (ఆదివారం) ఈరోజు ఫాదర్స్ డే.. మీతో పాటు కుటుంబం కోసం ఎంతో కష్టపడే నాన్నకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరుపురాని గిఫ్ట్ ఏదైనా ఇవ్వొచ్చు.

మీ బడ్జెట్‌కు సరిపోయే స్మార్ట్ గాడ్జెట్‌తో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఒకవేళ, మీ ఫాదర్ మ్యూజిక్ ప్రియులైనా, ఫిట్‌నెస్ లవర్ లేదా లేటెస్ట్ టెక్నాలతో అద్భుతమైన ప్రయోగాలు చేసేవారైతే రూ. 10వేల లోపు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Oppo Reno 12 Price : ఒప్పో రెనో 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ మీకోసం..!

ఈ స్మార్ట్‌వాచ్‌ల నుంచి హోమ్ థియేటర్‌ల వరకు ఫాదర్స్ డేని గుర్తుండిపోయేలా 5 అద్భుతమైన గాడ్జెట్‌లు అందుబాటలో ఉన్నాయి.

ఇయర్‌బడ్స్ :
మీ ఫాదర్ ట్రావెల్ సమయంలో మ్యూజిక్ వినడం, ఆఫీస్ కాల్స్ మాట్లాడటం లేదా పాడ్‌కాస్ట్‌లను ట్యూన్ చేయడం ఇష్టపడితే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో రూ. 9,990కి కొనుగోలు చేయొచ్చు. జేబీఎల్ లైవ్ ప్రో 2 రూ. 7,999, రియల్‌మి బడ్స్ ఎయిర్ 7 ప్రో రూ. 5,499కి అందుబాటులో ఉంది. ఇందులో ఏదైనా కొనే గిఫ్ట్ ఇవ్వొచ్చు.

స్మార్ట్‌వాచ్‌లు :
స్మార్ట్ వాచ్ అనేది కేవలం ట్రెండీ యాక్సెసరీ మాత్రమే కాదు. మీ నాన్నగారి ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవచ్చు. ఆయన హెల్త్ గురించి ట్రాక్ చేసేందుకు వాడొచ్చు.

ఫోన్ కూడా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. అమెజాన్‌లో నాయిస్ ప్రో 6 మ్యాక్స్ ధర రూ. 7,999, టైటాన్ సెలెస్టర్ రూ. 9,995 ధరకు లభిస్తుంది.

హోమ్ థియేటర్లు :
సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లని వారు అయితే.. హోమ్ థియేటర్ సిస్టమ్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. లివింగ్ రూమ్‌ను మినీ థియేటర్‌గా మార్చేయొచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో కొన్ని హోమ్ థియేటర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఫిలిప్స్ MMS8085B/94 కన్వర్టిబుల్ హోమ్ థియేటర్ సిస్టమ్ ధర రూ. 6,999 ఉండగా, సోనీ SA-D40 ధర రూ. 9,999, బోట్ బ్లిట్జ్2000 ధర రూ. 5,999 నుంచి లభ్యమవుతున్నాయి.

స్మార్ట్ స్పీకర్లు :
మీ నాన్నకు స్మార్ట్ స్పీకర్లు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. మ్యూజిక్ లేదా రిమైండర్‌లను సెట్ చేయాలన్నా లేదా లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలన్నా స్మార్ట్ స్పీకర్లు రెగ్యులర్ వాయిస్ కమాండ్‌ల ద్వారా అందిస్తాయి. మీరు అలెక్సా ఎకో డాట్ (5వ జనరేషన్) అలెక్సా ఎకో పాప్ వంటి ఆప్షన్లలో గాడ్జెట్లను ఎంచుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అల్ట్రా 5G ఫోన్ కొనేసుకోండి..!

హెడ్‌ఫోన్లు :
మీ ఫాదర్ ఇయర్‌బడ్‌ల కన్నా హెడ్‌ఫోన్‌లను ఇష్టపడేవారైతే.. జాగింగ్, వాకింగ్ లేదా మ్యూజిక్ కోసం అద్భుతమైన గాడ్జెట్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో సోనీ WH-CH720N ధర రూ. 8,990, ఫ్లిప్‌కార్ట్‌లో JBL ట్యూన్ 770NC రూ. 5,999 ధర వంటి ఆప్షన్లలో పొందవచ్చు.