Oppo Reno 12 Price : ఒప్పో రెనో 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ మీకోసం..!

Oppo Reno 12 Price : ఒప్పో రెనో 12 ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు.

Oppo Reno 12 Price : ఒప్పో రెనో 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ మీకోసం..!

Oppo Reno 12 Price

Updated On : June 15, 2025 / 11:17 AM IST

Oppo Reno 12 Price : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 12 ఫోన్ (Oppo Reno 12 Price) రూ. 13,500 వరకు భారీ తగ్గింపుతో లభిస్తోంది.

కొత్త ఫోన్ అప్‌గ్రేడ్ చేస్తుంటే ఈ డీల్ మీకోసమే.. కానీ, ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఒప్పో రెనో 12 అతి తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Lost your Phone : మీ ఫోన్ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? డోంట్ వర్రీ.. ఈ సింపుల్ ట్రాకింగ్ ద్వారా ఇట్టే కనిపెట్టేయొచ్చు..!

ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 12 డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో రెనో 12 రూ.32,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,999కు లిస్ట్ అయింది.

రెనో 12 హ్యాండ్‌సెట్‌పై రూ.12వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఎక్స్ఛేంజ్ చేయవచ్చు.

ఒప్పో రెనో 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 12 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. హుడ్ కింద, రెనో 12 మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 12 ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S24 Ultra : బిగ్ డిస్కౌంట్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్ జస్ట్ ఎంతంటే?

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది. రెనో ఫోన్ ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ రైటర్, ఏఐ రికార్డింగ్ సమ్మరీ, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్టూడియో వంటి అనేక ఏఐ ఫీచర్లను అందిస్తుంది.