Samsung Galaxy S24 Ultra : బిగ్ డిస్కౌంట్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్ జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర భారీగా తగ్గింది. శాంసంగ్ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు అందిస్తోంది.

Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కొనేసుకోవచ్చు. 200MP కెమెరాతో ఈ 5G ఫోన్ (Samsung Galaxy S24 Ultra) అతి తక్కువ ధరకే లభిస్తోంది.
ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సాధారణంగా లక్ష కన్నా ఎక్కువ ఉంటుంది. అమెజాన్ భారీ తగ్గింపు ధరకే ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ఈ శాంసంగ్ ఫోన్ రూ. 70వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G డిస్కౌంట్ :
అమెజాన్‌లో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర రూ. 1,34,999కు లభిస్తోంది. అమెజాన్ ఈ ఫోన్ ధరను 37 శాతం తగ్గించి కేవలం రూ. 84,999కే అందిస్తోంది. రూ. 2,547 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
అదనంగా, రూ.61,150 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ డీల్ ద్వారా దాదాపు రూ.70వేలకే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఉంటుందని గమనించాలి.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
ఈ గెలాక్సీ S24 అల్ట్రా టైటానియం ఫ్రేమ్ (Samsung Galaxy S24 Ultra) కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో వస్తుంది. 6.8-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంది.
మెమరీ పరంగా 12GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీని అందిస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం బ్యాక్ సైడ్ 200 + 10 + 50 + 12MP వంటి 5 సెన్సార్‌లతో కెమెరా సెటప్ ఉంది. 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీ కూడా ఉంది.