NPS Vatsalya Scheme : మీ పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్.. కేవలం రూ. 1.80 లక్షల పెట్టుబడితో రూ.11 కోట్ల రాబడి పొందొచ్చు..!
NPS Vatsalya Scheme : మీ పిల్లల కోసం కోట్ల డబ్బును కూడబెట్టవచ్చు. NPS వాత్సల్య పథకంలో చిన్న పెట్టుబడితో దీర్ఘకాలంలో కోట్ల రాబడిని పొందవచ్చు. అది ఎలాగంటే?

NPS Vatsalya Scheme
NPS Vatsalya Scheme : ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. తమ సంపాదనలో కొద్ది మొత్తంలోనైనా పిల్లల కోసం (NPS Vatsalya Scheme) దాచిపెట్టాలని అనుకుంటారు.
తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసమని ఆ డబ్బును సేవింగ్ చేస్తుంటారు. అంతేకాదు.. పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ డబ్బును మరింత రెట్టింపు చేసుకోవాలని కోరుకుంటారు. మీరు కూడా మీ పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా?
అయితే, మీకోసం అనేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో NPS వాత్సల్య పథకం ఒకటి. అన్నింటికి కన్నా పిల్లల కోసం అద్భుతమైన పథకమని చెప్పవచ్చు. ఈ పథకంలో పెట్టబడి ద్వారా చక్రవడ్డీ పొందవచ్చు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా కూడా దీర్ఘకాలం కొనసాగిస్తే కోట్ల రాబడిని పొందవచ్చు.
Read Also : OnePlus 13R Price : అతి చౌకైన ధరకే వన్‌ప్లస్ 13R ఫోన్ కొనేసుకోండి.. ఈ బిగ్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
ఈ NPS వాత్సల్య పథకం కింద 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీరు బిడ్డ పుట్టిన వెంటనే ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే.. 18 ఏళ్ల వయస్సు వరకు వాత్సల్య యోజన కింద ఖాతాగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఈ అకౌంట్ రెగ్యులర్ NPS అకౌంట్‌గా మారుతుంది. అయితే, ఇందులో రెండు రకాల అకౌంట్లపై చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
రూ. 11 కోట్ల రాబడి ఎలా? :
ఈ పథకం కింద ఏడాదికి రూ. 11 కోట్ల రాబడిని సంపాదించుకోవచ్చు. అంటే.. ఏడాదికి రూ. 10వేలు పెట్టుబడి పెడతారు. ప్రతి నెలా దాదాపు రూ. 834 క్రెడిట్ చేస్తారు అనమాట. ఈ మొత్తాన్ని 18 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తరువాత, మీ అకౌంట్ రెగ్యులర్ NPS ఖాతాగా మారుస్తారు. మీరు కూడబెట్టిన మొత్తం 60 ఏళ్ల వయస్సు వరకు పెరుగుతూనే ఉంటుంది.
18ఏళ్లలో ఎంత పెట్టుబడి పెట్టాలి? :
మీరు పిల్లల పేరు మీద ప్రతి ఏడాదిలో రూ. 10 వేలు జమ చేస్తే.. 18 ఏళ్లలో మొత్తం పెట్టుబడి 1.80 లక్షలు అవుతుంది. మీరు ఈ పెట్టుబడిపై ప్రతి ఏడాది 10 శాతం రాబడిని పొందితే.. 18 ఏళ్లలో ఈ డబ్బు దాదాపు రూ. 5 లక్షలకు పెరుగుతుంది.
గత 20 ఏళ్ల డేటాను పరిశీలిస్తే.. NPS దాదాపు 12.80 శాతం రాబడిని ఇచ్చింది. ఇప్పుడు 18 ఏళ్ల వయస్సు నుంచి 60 లక్షల వయస్సు వరకు మీ పెట్టుబడిపై వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇకపై ఎలాంటి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు.
60 ఏళ్ల వయస్సులో రాబడి ఎంతంటే? :
మీకు బిడ్డ పుట్టగానే వారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి. 18 ఏళ్ల వయస్సు వరకు మీ పెట్టుబడిపై 10శాతం వడ్డీని పొందుతారు. అప్పుడు రూ. 5 లక్షల రాబడి పొందచ్చు. ఇప్పుడు ఈ రూ. 5 లక్షలపై 60 ఏళ్ల వయస్సు వరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా వడ్డీని పొందవచ్చు. 10శాతం రాబడిని పొందితే.. 60 ఏళ్ల వయస్సు నాటికి రూ. 2.75 కోట్ల రాబడి పొందవచ్చు. 20 ఏళ్ల డేటాను పరిశీలిస్తే.. మీరు 12.86 శాతం రాబడితో రూ. 5 లక్షల నుంచి రూ. 11.05 కోట్లకు రాబడి పెరుగుతూ పోతుంది.
ఎలా పెట్టుబడి పెట్టాలంటే? :
భారీ మొత్తంలో రాబడి పొందాలంటే.. (75శాతం ఈక్విటీ) ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు 75శాతం డబ్బును ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి. తద్వారా మార్కెట్ ప్రకారం భారీగా రాబడిని పొందవచ్చు. గత 20 ఏళ్ల NPS రికార్డును పరిశీలిస్తే.. ఈక్విటీలో 50శాతం, కార్పొరేట్ రుణంలో 30శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలలో 20శాతం పెట్టుబడితో సగటున 11.59శాతం రాబడి లభించింది. ఈక్విటీలో పెట్టుబడిని 75శాతానికి పెంచితే వచ్చే రాబడి 12.86శాతం వరకు ఉండవచ్చు.
పిల్లల అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? :
- eNPS వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- NPS వాత్సల్య (మైనర్లు) ట్యాబ్ కింద ‘Register Now’పై క్లిక్ చేయండి.
- గార్డియన్ పుట్టిన తేదీ, పాన్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్‌ను ఎంటర్ చేయండి.
- OTP వెరిఫై తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
- మైనర్, గార్డియన్ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- కనీస పెట్టుబడి రూ. 1,000 పెట్టండి.
- డబుల్ OTP లేదా (eSignintre)తో రిజిస్టర్ చేస్తే అకౌంట్ రెడీ అయినట్టే..
మీరు అకౌంట్ నుంచి ఎప్పుడు డబ్బు తీసుకోవచ్చు? :
3 ఏళ్ల లాక్-ఇన్ వ్యవధి తర్వాత తల్లిదండ్రులు విద్య, తీవ్రమైన అనారోగ్యం లేదా 75శాతం కన్నా ఎక్కువ వైకల్యం కోసం 25శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మొత్తం కాలంలో 3 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. 18 ఏళ్ల వయస్సులో అకౌంట్ రెగ్యులర్ NPS అకౌంటుగా మారుతుంది.
Read Also : Vivo T4 Lite : కొత్త వివో T4 లైట్ ఫోన్ ఇదిగో.. అతి త్వరలో లాంచ్.. ఖతర్నాక్ ఫీచర్లు.. మీ బడ్జెట్ ధరలోనే..!
ఈ సమయంలో కనీసం 80శాతం కార్పస్‌ను యాన్యుటీని ఉపయోగించాలి. మిగిలిన 20శాతం క్యాష్ రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. మొత్తం కార్పస్ రూ. 2.5 లక్షల కన్నా తక్కువ ఉంటే.. మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
Disclaimer : పెట్టుబడిపై ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దీనికి సంబంధించిన నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి.