Lost your Phone : మీ ఫోన్ పోయిందా? ఎవరైనా దొంగిలించారా? డోంట్ వర్రీ.. ఈ సింపుల్ ట్రాకింగ్ ద్వారా ఇట్టే కనిపెట్టేయొచ్చు..!
Lost your phone : ఫోన్ పోయిందా? మీ ఫోన్ ఎవరూ దొంగిలించినా లేదా ఎక్కడైనా పొగొట్టుకున్నా సరే.. ఇలా ట్రాకింగ్ చేసి ఈజీగా లొకేషన్ తెలుసుకోవచ్చు..

Lost your Phone
Lost your phone : మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారా? ఎవరైనా మీ ఫోన్ దొంగిలించారా? అయితే, డోంట్ వర్రీ.. మీ ఫోన్ ఎక్కడికి పోదు.. ఇలా ట్రాకింగ్ ద్వారా ఈజీగా పోయిన ఫోన్ (Lost your phone) ఎక్కడ ఉన్నా ఈజీగా కనిపెట్టేయొచ్చు. భారత ప్రభుత్వం అందించే ఈ సర్వీసు ద్వారా మీ ఫోన్‌ను ట్రాక్ చేసి తిరిగి పొందవచ్చు. టెలికాం శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభించింది.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CIER) వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేయడమే కాదు.. ట్రాక్ చేసి తిరిగి పొందవచ్చు. ఈ పోర్టల్ ప్రారంభమైనప్పటినుంచి 33,18,051 స్మార్ట్‌ఫోన్‌లను బ్లాక్ చేసింది. 20,07,749 మొబైల్ ఫోన్లను గుర్తించింది. ఇప్పటికే 4,57,320 ఫోన్లను పొగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించింది. ఒకవేళ పోగొట్టుకున్న మీ ఫోన్‌ను ఎలా ట్రాక్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Read Also : Samsung Galaxy S24 Ultra : బిగ్ డిస్కౌంట్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్ జస్ట్ ఎంతంటే?
మీ ఫోన్‌ను ట్రాకింగ్ ద్వారా ఎలా పొందాలి? :
పోగొట్టుకున్న ఫోన్‌ను ట్రాకింగ్ చేసేందుకు వినియోగదారులు తమ టెలికాం ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డును పొందాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆపై సంచార్ సాథి పోర్టల్‌ను విజిట్ చేయాలి. సంచార్ సాథి పోర్టల్‌లో ఫిర్యాదు ఎలా చేయాలంటే..
- https://www.ceir.gov.in/ ని సందర్శించండి.
- హోమ్‌పేజీలో బ్లాక్ / స్టోలెన్ మొబైల్‌పై ట్యాప్ చేయండి.
- మొబైల్ IMEI నంబర్, ఫిర్యాదు వివరాలు, ఆధార్-లింక్డ్ అడ్రస్, అల్ట్రానేట్ కాంటాక్ట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- రిజిస్టర్ చేసుకున్న తర్వాత సిస్టమ్ పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ విభాగాలు, టెలికాం ఆపరేటర్లను అప్రమత్తం చేస్తుంది.
- దొంగిలించిన లేదా పోగొట్టుకున్న ఫోన్‌ను మళ్ళీ వాడితే అదే సిమ్ లేదా కొత్త సిమ్ ద్వారా నెట్‌వర్క్ అంతటా వార్నింగ్ ట్రిగ్గర్ అవుతాయి. సిస్టమ్ ఫోన్‌ను గుర్తించి అలర్ట్ చేస్తుంది.
- ఫోన్ పోయిన విషయాన్ని త్వరగా రిపోర్టు చేయడం చాలా కీలకం.
- ముందస్తు రిజిస్ట్రేషన్ ఫోన్ చేతులు మారడానికి లేదా అక్రమ రవాణాకు ముందు ట్రాక్ చేసేందుకు వీలుంటుంది” అని C-DOT తెలిపింది.
CIER పోర్టల్‌లో డేటా ప్రకారం.. ఢిల్లీ (NCR) 7.9 లక్షలకు పైగా మొబైల్ థెఫ్ట్ లేదా నష్టం కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత మహారాష్ట్ర 4.18 లక్షల కేసులతో కర్ణాటక 3.90 లక్షల కేసులతో, లక్షద్వీప్ కేవలం 11 కేసులతో అట్టడుగున ఉన్నాయి.