Kia Seltos Sales : కియా క్రేజే వేరే లెవల్.. ఈ కారుకు ఫుల్ గిరాకీ.. ఇండియాలో 6 లక్షల మంది కొనేశారు.. ధర ఎంతంటే?
Kia Seltos Sales : కియా సెల్టోస్ కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. భారత మార్కెట్లో కియా సెల్టోస్ 6 లక్షల యూనిట్లను చేరుకుంది. ఫీచర్లు, మైలేజీ వివరాలపై ఓసారి లుక్కేయండి.
Kia Seltos Sales
- కియా సెల్టోస్ కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్
- హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్న కియా సెల్టోస్ మోడల్స్
- ఇప్పటికే 6 లక్షల యూనిట్లు దాటేసిన సేల్స్
Kia Seltos Sales : కొత్త కారు కొనేవారికి అద్భుతమైన న్యూస్.. కియా ఫ్యాన్స్ మాత్రం పండగ చేస్కోండి. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా భారత మార్కెట్లో అద్భుతమైన మోడల్స్ అందిస్తోంది. ఇప్పటికే అనేక మోడల్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది.
ఈ కార్లలో కియా సెల్టోస్ ఒకటి. భారతీయ మార్కెట్లో బాగా పాపులర్ అయింది. కియా 2019లో సెల్టోస్‌ను లాంచ్ చేసింది. అప్పటి నుంచి వినియోగదారులు తెగ కొనేస్తున్నారు. ఇప్పటివరకూ దేశ మార్కెట్లో 6లక్షలయూనిట్లకు పైగా కియా సెల్టోస్ అమ్ముడయ్యాయి. కియా సెల్టోస్ ముఖ్య ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
కియా సెల్టోస్ డిజైన్ :
కియా సెల్టోస్ పవర్ఫుల్ డిజైన్ కారణంగా బాగా పాపులర్ అయింది. కొత్త జనరేషన్ కియా సెల్టోస్ మరింత మోడ్రాన్ డిజైన్ అందిస్తుంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, వర్టికల్ ఎల్ఈడీ హెడ్లైట్లు, మోటరైజ్డ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్టైలిష్ కొత్త టెయిల్‌లైట్ అందిస్తుంది. సెల్టోస్ ప్రీమియం, స్పోర్టీ డిజైన్‌తో ముఖ్యంగా యువ రైడర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది.
కియా సెల్టోస్ క్యాబిన్ :
కొత్త కియా సెల్టోస్ గతంలో కన్నా ఎక్కువ స్పేస్ అందిస్తుంది. లాంగ్ వీల్‌బేస్ కారణంగా క్యాబిన్ మరింత విశాలంగా సౌకర్యవంతంగా ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి.
కియా సెల్టోస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ :
కియా సెల్టోస్ అనేక అడ్వాన్స్ ఫీచర్లను అందిస్తుంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ + 12.3-అంగుళాల డిజిటల్ క్లస్టర్, 5-అంగుళాల డిజిటల్ క్లైమేట్ స్క్రీన్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, ఇంటర్నల్ డాష్‌క్యామ్ వంటి హై-టెక్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. కియా సెల్టోస్ 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, లెవల్-2 అడాస్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.
కియా సెల్టోస్ ఇంజిన్ :
కియా సెల్టోస్ మూడు 1.5-లీటర్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఉన్నాయి.
