Gaming Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. మీ బడ్జెట్ ధరలో టాప్ 5 గేమింగ్ స్మార్ట్ఫోన్లు.. ఏది కొంటారో మీదే ఛాయిస్!
Gaming Smartphones : మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఫిబ్రవరి 2026లో అద్భుతమైన ఫీచర్లతో టాప్ 5 గేమింగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?
Gaming Smartphones
- బడ్జెట్ ధరలో అద్భుతమైన గేమింగ్ ఫోన్లు
- ఫిబ్రవరిలో టాప్ 5 లో కాస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే
- రియల్‌మి జీటీ 7 నుంచి వివో T4 ప్రో వరకు ఫోన్ లిస్టు
Gaming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు మొబైల్ గేమ్ ఆడుతుంటారా? అయితే ఇది మీకోసమే. తక్కువ ఖర్చులో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ కొనేవారికి బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు.
కేవలం మీ బడ్జెట్ ధరలో మంచి గేమింగ్ ఫోన్లను కొనేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫిబ్రవరి 2026లో భారతీయ మార్కెట్లోలభించే గేమింగ్ ఫోన్లలో మీకోసం అతి తక్కువ ధరకే టాప్ 5 స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
రియల్‌మి జీటీ 7 :
రియల్‌మి జీటీ 7 ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ స్క్రీన్ 1B కలర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400e ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. బ్యాటరీ సామర్థ్యంతో 7000mAh, 120W ఛార్జర్‌తో వస్తుంది.
ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ :
ఒప్పో F31 ప్రో 5జీ ఫోన్ 6.57-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz, 1B కలర్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కార్టెక్స్-A55 సీపీయూతో మాలి-G615 MC2 జీపీయూతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 80W ఛార్జర్, 7000 mAh బ్యాటరీతో వస్తుంది.
ఐక్యూ నియో 10R 5జీ :
ఐక్యూ నియో 10R 5జీలో డ్యూయల్ 50MP + 8MP రియర్ కెమెరాతో పాటు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫన్టచ్పై రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అడ్రినో 735 జీపీయూ, కార్టెక్స్-A520 సీపీయూ కూడా ఉన్నాయి.
ఐక్యూ నియో 10 :
ఐక్యూ నియో 10 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, 120W ఛార్జర్‌తో వస్తుంది. కార్టెక్స్-A720 సీపీయూ, అడ్రినో 825 జీపీయూతో వస్తుంది. 50MP + 8MP డ్యూయల్ కెమెరాతో పాటు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
వివో T4 ప్రో :
32MP సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ 50MP రియర్ కెమెరాతో వివో T4 ప్రో 5G అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఫన్ టచ్ 15పై రన్ అవుతుంది. స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. కార్టెక్స్-520 సీపీయూ, అడ్రినో 722 జీపీయూతో వస్తుంది. 90W ఛార్జర్, 6500 mAh బ్యాటరీతో వస్తుంది.
