Renigunta Railway Station : తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్లో వ్యక్తి హల్చల్.. ట్రైన్ బోగీలపైకెక్కి పరుగులు.. బిగ్ షాకిచ్చిన రైల్వే పోలీసులు
Renigunta Railway Station : తిరుపతి జిల్లాలోని రేణిగుంట రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి ఆగిఉన్న రైలు పైకెక్కి పరుగులు తీశాడు. బలవన్మరణం చేసుకుంటానని హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
Renigunta Railway Station
Renigunta Railway Station : తిరుపతి జిల్లాలోని రేణిగుంట రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి ఆగిఉన్న రైలు పైకెక్కి పరుగులు తీశాడు. బలవన్మరణం చేసుకుంటానని హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో.. ఇంతలోనే సదరు వ్యక్తి కిందపడబోయే ప్రయత్నంలో ఆర్పీఎఫ్ సిబ్బంది నెట్ సాయంతో అతన్ని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటనతో కొద్ది నిమిషాల పాటు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
Also Read : Digital Gold : డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? కేంద్రం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఇవే!
రేణిగుంట రైల్వే స్టేషన్లో అస్సాంకు చెందిన వ్యక్తి హల్చల్ చేశాడు. ఆగిఉన్న రైలు పైకెక్కిన అతను తాను చనిపోతానంటూ రైలు బోగీలపై పరుగులు పెట్టాడు. హైటెన్షన్ వైర్లను పట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ వెంటనే రైలు బోగీపై ఉన్న అతనికి సర్దిచెప్పి కిందికి దింపేందుకు ఓ ఇద్దరు వ్యక్తులు రైలు బోగీపైకి ఎక్కారు. కిందికి దిగాలని సూచించారు. కానీ, అతను దిగకపోవటంతో అతన్ని బలవంతంగా పట్టుకోగా.. వారిపై దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కిందపడిపోతుండగా ఆర్పీఎఫ్ సిబ్బంది నెట్ సాయంతో కాపాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కారణంగా గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనికి మతిస్థిమితి లేదని తెలుస్తోంది.
