iPhone 16 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో ధర.. ఈ క్రేజీ డీల్ అసలు మిస్ చేయొద్దు..!

iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ గ్రేట్ ఎలా పొందాలంటే?

iPhone 16 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో ధర.. ఈ క్రేజీ డీల్ అసలు మిస్ చేయొద్దు..!

iPhone 16 Pro

Updated On : June 15, 2025 / 4:42 PM IST

iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో (iPhone 16 Pro) ఉంది. నాన్-ప్రో మోడల్‌తో పాటు ఇప్పుడు కంపెనీ ప్రో మోడళ్లపై కూడా అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది.

ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై కూడా డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్‌ 16 మోడల్ కొనుగోలు చేస్తే.. రూ. 10వేలు డైరెక్ట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 3వేలు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్‌ను ఎలా పొందాలో ఓసారి పరిశీలిద్దాం..

Read Also : PM Kisan : గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత అప్పుడే.. రూ. 2వేలు పడతాయో లేదో తెలుసుకోండిలా..!

ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్ ఆఫర్ :
ఐఫోన్ 16 ప్రో రూ.1,19,900 ధరకు లాంచ్ చేసింది. కానీ, ఈ ఐఫోన్ ఎలాంటి బ్యాంక్ డిస్కౌంట్ లేకుండా రూ.1,09,900 ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఐఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డుతో రూ. 3వేలు డైరెక్ట్ డిస్కౌంట్ తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. తద్వారా ఐఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్లు :
రూ.61,700 వరకు ఎక్స్ఛేంజ్ (iPhone 16 Pro) ఆఫర్, రూ.3వేల అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భారీగా తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తిగా పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 11 ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 17,500 వరకు తగ్గింపు పొందవచ్చు. రూ. 3వేల బోనస్ కూడా పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో ఫీచర్లు :
ఆపిల్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.3-అంగుళాల LTPO ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. HDR10, డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ కూడా ఉంటుంది.

Read Also : Senior citizens Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే ప్రతినెలా రూ. 60వేలకు పైగా సంపాదించుకోవచ్చు!

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ ట్రిపుల్ రియల్ కెమెరాను కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరా 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రా-వైడ్ కెమెరాతో కనిపిస్తుంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.