Vivo T3 Pro : వివో లవర్స్‌కు పండగే.. వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. ఈ అద్భుతమైన డీల్ డోంట్ మిస్..!

Vivo T3 Pro : కొత్త వివో ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్ ఎపిక్ సేల్ ద్వారా వివో T3 ప్రో కొనుగోలుపై ఎక్స్ క్లూజివ్ ఆఫర్లను అందిస్తోంది.

Vivo T3 Pro : వివో లవర్స్‌కు పండగే.. వివో T3 ప్రో అతి తక్కువ ధరకే.. ఈ అద్భుతమైన డీల్ డోంట్ మిస్..!

Vivo T3 Pro

Updated On : June 15, 2025 / 5:41 PM IST

Vivo T3 Pro : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మీ బడ్జెట్ రూ. 25వేల లోపు అయితే ఇది (Vivo T3 Pro) మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ ఎపిక్ సేల్ వివో T3 ప్రో 5G కొనుగోలు చేయవచ్చు.

Read Also : iPhone 16 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో ధర.. ఈ క్రేజీ డీల్ అసలు మిస్ చేయొద్దు..!

అనేక ఆఫర్లు, మరెన్నో డీల్స్ కూడా పొందవచ్చు. ఈ వివో ఫోన్ వీగన్ లెదర్ ఫినిషింగ్, కర్వ్డ్-ఎడ్జ్ డిస్‌ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. సరసమైన ధరకు ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వివో T3 ప్రో 5Gపై డిస్కౌంట్ ఆఫర్లు :
ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.29,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా 23శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆపై ధర రూ.21,999కి తగ్గుతుంది.

అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ. 22500 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. రూ. 3834 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మొత్తం 2 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

వివో T3 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
వివో ఈ 5G మొబైల్ ఫోన్ 6.77-అంగుళాల (Vivo T3 Pro) ఫుల్ HD అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది.

Read Also : Jio Cheapest Plan : పండగ చేస్కోండి.. చీపెస్ట్ జియో ప్లాన్ ఇదిగో.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా.. OTT బెనిఫిట్స్ కూడా..!

ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉంది. 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.