Poco F7 Launch : అతిపెద్ద బ్యాటరీతో పోకో F7 ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. సింగిల్ ఛార్జ్‌తో 52 గంటలపైనే..!

Poco F7 Launch : భారీ బ్యాటరీతో పోకో F7 ఫోన్ వస్తోంది.. ఈ నెలాఖరులో లాంచ్ కానుంది. ఫీచర్లకు సంబంధించి కీలక వివరాలు లీక్ అయ్యాయి..

Poco F7 Launch : అతిపెద్ద బ్యాటరీతో పోకో F7 ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. సింగిల్ ఛార్జ్‌తో 52 గంటలపైనే..!

Poco F7 Launch

Updated On : June 16, 2025 / 11:44 AM IST

Poco F7 Launch : కొత్త పోకో ఫోన్ కొంటున్నారా? షావోమీ సబ్ బ్రాండ్ పోకో నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7 (Poco F7 Launch) లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

లీక్‌ల ప్రకారం.. దేశంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్యాటరీతో రాబోతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రమోషనల్ టీజర్ పరిశీలిస్తే.. పోకో F7 ఫోన్ 7,550mAh బ్యాటరీని కలిగి ఉండనుంది.

Read Also : PAN Card : మీ పాన్ కార్డు పనిచేస్తుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. లేదంటే రూ. 10వేలు పెనాల్టీ కట్టాల్సిందే..!

ఐక్యూ Z10, వివో T4 వంటి ఫోన్లు కూడా 7,300mAh బ్యాటరీ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ కూడా పోకో F7 SI/C బ్యాటరీ టెక్నాలజీతో రానుందని సూచించింది. సింగిల్ ఛార్జ్‌పై 2.18 రోజుల (52 గంటలు) వరకు ఛార్జింగ్ ఉంటుంది.

ఫాస్ట్ ఛార్జింగ్, పవర్ బ్యాంక్ మోడ్ :
పోకో F7 ఛార్జింగ్ ఎక్కువ సమయం పట్టదు. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావచ్చు. క్విక్ రీఛార్జ్‌ అవుతుంది. ఈ ఫోన్ 22.5W రివర్స్ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

డిజైన్, కెమెరా లీక్స్ :
ఆన్‌లైన్‌ లీక్ డేటా ప్రకారం.. పోకో F7 బ్లాక్ కలర్ డ్యూయల్-లెన్స్ బ్యాక్ కెమెరా సెటప్‌తో రావచ్చు. కెమెరా ఐలాండ్‌పై డ్యూయల్-టోన్ డిజైన్‌ కూడా ఉండొచ్చు. మల్టీ వేరియంట్‌లు, ఎండ్ అందుబాటులో ఉంటాయని సూచిస్తున్నాయి.

ఈ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 20MP ఫ్రంట్ కెమెరాతో సహా ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

స్పెషిఫికేషన్లు అంచనా :
స్నాప్‌డ్రాగన్ పవర్, అమోల్డ్ డిస్‌ప్లే , IP68 రేటింగ్ కలిగి ఉంది. లీక్స్ ప్రకారం.. పోకో F7 రీబ్రాండెడ్ రెడ్‌మి టర్బో 4 ప్రో కావచ్చు. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 16GB ర్యామ్, 1TB స్టోరేజీ వరకు, 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే , 120Hz రిఫ్రెష్ రేట్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.

Read Also : Jio Annual Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. ఈ ప్లాన్‌తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ కాలింగ్, 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ OTT బెనిఫిట్స్..!

నివేదికల ప్రకారం.. ఈ నెలాఖరులో పోకో F7 ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పోకో అభిమానులు ఈ పవర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే పొందవచ్చు.