Samsung Galaxy S24 Plus 5G : కిర్రాక్ ఆఫర్.. లక్ష విలువైన శాంసంగ్ 5G ఫోన్.. జస్ట్ రూ. 50వేలకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Samsung Galaxy S24 Plus 5G : అదిరిపోయే ఆఫర్.. లక్ష విలువైన శాంసంగ్ 5G ఫోన్ కేవలం రూ. 50,500కే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 Plus 5G : కిర్రాక్ ఆఫర్.. లక్ష విలువైన శాంసంగ్ 5G ఫోన్.. జస్ట్ రూ. 50వేలకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Samsung Galaxy S24 Plus 5G

Updated On : June 17, 2025 / 11:06 AM IST

Samsung Galaxy S24 Plus 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? తక్కువ ధరకే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ (Samsung Galaxy S24 Plus 5G) కొనేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5G ఫోన్ కొనేసుకోవచ్చు.

ఈ శాంసంగ్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్, ప్రీమియం డిస్‌ప్లే సహా పలు ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ S24 ప్లస్ 5G రూ.50,500 లోపు అందుబాటులో ఉంది. మీ ఫోన్‌ అప్‌గ్రేడ్ కోసం చూస్తుంటే.. ఈ డీల్‌ను అసలు మిస్ చేసుకోవద్దు.

Read Also : iPhone 16 Plus : అద్భుతమైన ఆఫర్.. చౌకైన ధరకే ఐఫోన్ 16 ప్లస్‌ కొనేసుకోండి.. ఇంత తక్కువలో మళ్లీ రాదు..!

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ప్రారంభ ధర రూ.99,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.52,999కే లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.47వేలకు తగ్గింది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ.2,650 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ పొందవచ్చు. ట్రేడ్-ఇన్‌ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ. 38,600 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ఫోన్ 6.7-అంగుళాల 2K LTPO అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఎక్సినోస్ 2400 SoC ద్వారా 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4900mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Oppo K13x 5G : ఒప్పో K13x 5G వస్తోందోచ్.. ఈ నెల 23నే లాంచ్.. ధర, కీలక ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.