iPhone 16 Plus : అద్భుతమైన ఆఫర్.. చౌకైన ధరకే ఐఫోన్ 16 ప్లస్ కొనేసుకోండి.. ఇంత తక్కువలో మళ్లీ రాదు..!
iPhone 16 Plus : ఐఫోన్ 16 ప్లస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ అద్భుతమైన ఐఫోన్ డీల్ అసలు వదులుకోవద్దు.

iPhone 16 Plus
iPhone 16 Plus : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 11,900 కన్నా ఎక్కువ సేవ్ చేయొచ్చు.
Read Also : Post Office : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ. 17 లక్షల రాబడి పక్కా..!
ఈ డీల్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) కొనుగోలు చేయాలని చూస్తుంటే అసలు వదులుకోవద్దు.. ఈ అద్భుతమైన ఆఫర్ వెంటనే సొంతం చేసుకోండి.. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 81,990కు లిస్టు అయింది. రూ. 7,910 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ఫోన్ ఆపిల్ A18 చిప్ ద్వారా పవర్ పొందుతుంది ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లన్నింటినీ సపోర్ట్ చేస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
Read Also : Oppo K13x 5G : ఒప్పో K13x 5G వస్తోందోచ్.. ఈ నెల 23నే లాంచ్.. ధర, కీలక ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!
ఫ్రంట్ సైడ్ ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది. ఇంకా, ఐఫోన్ 16 ప్లస్ IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.