×
Ad

OnePlus Nord CE 5 : పండగ చేస్కోండి.. కొత్త వన్‌ప్లస్ నార్డ్ CE 5 ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

OnePlus Nord CE 5 : వన్‌ప్లస్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ధర ఫస్ట టైమ్ భారీగా తగ్గింది.

OnePlus Nord CE 5

OnePlus Nord CE 5 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక రకాల ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

అయితే, ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ఇటీవలే లాంచ్ కాగా డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. కొత్త మిడ్-బడ్జెట్ ఫోన్ (OnePlus Nord CE 5) కోసం చూసేవారికి అద్భుతమైన డీల్‌ అని చెప్పొచ్చు. ఈ పాపులర్, బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ ఇంకా సరసమైన ధరకే ఎలా పొందాలో ఇప్పడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ నార్డ్ CE 5 ధర వివరాలివే :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది
8GB ర్యామ్ + 128GB స్టోరేజీ
8GB ర్యామ్ + 256GB స్టోరేజీ
12GB ర్యామ్ + 256GB స్టోరేజీ
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 24,999తో లాంచ్ అయింది. నెక్సస్ బ్లూ, బ్లాక్ ఇన్ఫినిటీ, మార్బుల్ మిస్ట్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ ఆఫర్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 స్పెషల్ సేల్ ఆఫర్ :
ఈ సేల్ సమయంలో మీరు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5పై రూ.3వేల వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ప్రారంభ ధర కేవలం రూ.21,749కి తగ్గుతుంది. అదనంగా, మరింత ఆకర్షణీయంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 5 ముఖ్య ఫీచర్లు :
డిస్‌ప్లే : ఈ ఫోన్ 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది.
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమన్షిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.
కెమెరా : బ్యాక్ కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ : ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 7100mAh బ్యాటరీ కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OSపై రన్ అవుతుంది.