Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ ఆఫర్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ మిస్ చేయొద్దు

Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ ఆఫర్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

Samsung Galaxy S24

Updated On : September 25, 2025 / 3:06 PM IST

Samsung Galaxy S24 Price : శాంసంగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ప్లాట్‌ఫామ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో డీల్‌లను అందిస్తోంది. మీరు శాంసంగ్ అభిమాని అయితే శాంసంగ్ గెలాక్సీ S24 అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

ఈ సేల్‌తో శాంసంగ్ ఫోన్ ధర దాదాపు 40 శాతం తగ్గింది. ఇంతకీ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ (Samsung Galaxy S24 Price) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి చూద్దాం.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ధర భారీగా తగ్గింది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB RAM వేరియంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ అసలు లాంచ్ ధర రూ.79,999 ఉండగా ఇప్పుడు ధర రూ.44,999కి తగ్గింది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ.2200 తగ్గింపు పొందవచ్చు. ఈ శాంసంగ్ S24 ఫోన్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, మార్బుల్ గ్రే, ఒనిక్స్ బ్లాక్ అనే 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : TECNO POVA 7 5G : ఫ్లిప్‌కార్ట్‌లో టెక్నో పోవా 7 5G సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.. రూ. 100 కోట్ల విలువైన లక్కీ డ్రా బహుమతులు కూడా పొందొచ్చు.. డోంట్ మిస్!

శాంసంగ్ గెలాక్సీ S24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4nm ప్రాసెస్ ఆధారంగా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 7 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా రూపొందిందింది.

శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ షూటర్, 10MP టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా కలిగి ఉంది. 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది.