Paytm : పేటీఎంలో PIN లేకుండా UPI పేమెంట్లు చేయొచ్చు.. కార్డు లేకుండా ATMలో డబ్బులు తీయొచ్చు!

Paytm : పేటీఎం నుంచి బిగ్ అప్‌డేట్.. కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. పిన్ లేకుండానే పేమెంట్లు చేయొచ్చు.

Paytm Introduces Face ID

  • పేటీఎం ఫింగర్ ఫ్రింట్, ఫేస్ ఐడీతో యూపీఐ పేమెంట్లు చేయొచ్చు
  • కార్డు లేకుండా ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా, క్యూఆర్ కోడ్‌ స్కాన్
  • బయోమెట్రిక్ పేమెంట్లపై ప్రతి లావాదేవీకి రూ. 5వేలు లిమిట్

Paytm : పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. పేటీఎం యాప్‌లో కొత్త బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ వచ్చింది. ఇకపై పేటీఎం యూజర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడీతో పేమెంట్లు చేయవచ్చు.

అలాగే, కార్డ్‌లెస్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా ఆప్షన్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఎన్‌పీసీఐ మార్గదర్శకాల ప్రకారం.. బయోమెట్రిక్ యూపీఐ పేమెంట్లకు ఒక్కో లావాదేవీకి పరిమితిని రూ. 5వేలుగా నిర్ణయించారు.

ఆండ్రాయిడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఓఎస్ ఫేస్ ఐడీ ఫోన్లలో ఇంటర్నల్ బయోమెట్రిక్ సిస్టమ్‌ ద్వారా ఈ ఫీచర్ వర్క్ అవుతుందని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. పేటీఎం గానీ, బ్యాంకులు గానీ యూజర్ల బయోమెట్రిక్ డేటాను స్టోర్ చేయవని తెలిపింది.

తద్వారా యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది ఉండదు. ఆసక్తిగల వినియోగదారులు తమకు ఇష్టమైన మెథడ్ ఎంచుకోవచ్చు. యూపీఐ పిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను పేమెంట్లు, బ్యాలెన్స్ చెకింగ్, ఏటీఎం విత్‌డ్రాయల్స్ వంటి వివిధ బెనిఫిట్స్ కోసం వినియోగించవచ్చు.

పేటీఎం కార్డ్‌లెస్ ఏటీఎం విత్‌డ్రాయల్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు ఇప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఫేస్ ఐడీ, ఫింగర్ ఫ్రింట్ లేదా యూపీఐ పిన్‌తో క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

Read Also : Realme 16 5G : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి 16 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. అతి చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..!

డెబిట్ లేదా ఏటీఎం కార్డును వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా, ఒక్కో లావాదేవీకి రూ. 10వేల వరకు క్యాష్ విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఉంది. అయితే, ఈ లిమిట్ బ్యాంకు, యూపీఐ నిబంధనలను బట్టి మారవచ్చు.

పేటీఎం ప్రకారం.. ఈ సిస్టమ్ లింక్ అయిన అనేక బ్యాంకు అకౌంట్ల మధ్య ఈజీగా ఎంచుకోవచ్చు. తద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఖాతా నుంచి ఫండ్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్లు పేమెంట్లతో పాటు క్యాష్ కూడా ఈజీగా తీసుకోవచ్చు.

పేటీఎం యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? :

  • బ్యాంక్ అకౌంట్ పేటీఎం యూపీఐలో లింక్ అయి యాక్టివ్‌గా ఉండాలి.
  • ‘UPI Cash Withdrawal’ లేదా ‘Cardless Withdrawal’ ఆప్షన్ ఉండే ఏటీఎంకు వెళ్లండి.
  • ఏటీఎం స్క్రీన్‌పై ‘UPI Cash Withdrawal’ను ఎంచుకోండి.
  • విత్‌డ్రా మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  • పేటీఎం యాప్‌ని ఉపయోగించి స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి.
  • బ్యాంకు అకౌంట్ ఎంచుకుని యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయండి
  • వెరిఫికేషన్ తర్వాత ఏటీఎం నుంచి క్యాష్ పొందవచ్చు.
  • పేటీఎంలో యూపీఐ పేమెంట్ల కోసం ఫేస్ ఐడీ లేదా ఫింగర్‌ప్రింట్‌ను ఎనేబుల్ చేయండి.
  • పేటీఎం యాప్‌ను ఓపెన్ చేయండి.
  • ప్రొఫైల్ ఐకాన్ ట్యాప్ చేయండి.
  • సెట్టింగ్స్‌లో ‘Payment’ లేదా “Pay With Fingerprint’ని ఎంచుకోండి
  • బ్యాంకు అకౌంట్ ఎంచుకోండి
  • ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీతో అథెంటికేట్ చేయండి.
  • బయోమెట్రిక్స్ ద్వారా పేమెంట్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.