Paytm Pocket Money : టీనేజర్లకు అదిరిపోయే ఫీచర్.. బ్యాంక్ ఖాతా లేకున్నా పేటీఎం పేమెంట్స్.. ఎలాగంటే?
Paytm Pocket Money : టీనేజర్లు చిన్న చిన్న కొనుగోళ్ల కోసం పేరెంట్స్‌ను డబ్బు అడగాల్సిన అవసరం ఉండదు. పేటీఎం 'పాకెట్ మనీ' అనే కొత్త ఫీచర్ వచ్చేసింది. తద్వారా పిల్లలు బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ పేమెంట్లు చేయవచ్చు.
- Sreehari A
- Updated on- May 18, 2026 / 06:10 PM IST
Paytm Pocket Money ( Image Credit : AI )
- పిల్లల ఖర్చుల కోసం పేటీఎంలో కొత్త పాకెట్ మనీ ఫీచర్
- బ్యాంకు అకౌంట్ లేకుండానే ఈ ఫీచర్‌తో పేమెంట్లు
- పిల్లల ఖర్చుల కంట్రోలింగ్ మాత్రం పేరెంట్స్ చేతుల్లో
Paytm Pocket Money : పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ప్రత్యేకించి టీనేజర్ల కోసం పేటీఎం ‘పాకెట్ మనీ’ అనే సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇకపై టీనేజర్లు చిన్న చిన్న ఖర్చుల కోసం తల్లిదండ్రులను పదేపదే డబ్బు అడగాల్సిన అవసరం ఉండదు. తద్వారా పిల్లలు బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. ఖర్చుల విషయంలో తల్లిదండ్రులకు పూర్తి కంట్రోల్ ఉంటుంది.
తద్వారా పిల్లలకు డిజిటల్ స్వేచ్ఛతో పాటు సేఫ్టీ కూడా లభిస్తుంది. టీనేజర్లు ఇప్పుడు (Paytm Pocket Money) డిజిటల్ పేమెంట్ల ప్రపంచంలోకి ఈజీగా ఎంట్రీ ఇవ్వొచ్చు. ఈ ఫీచర్ ఎన్‌పీసీఐ (NPCI) యూపీఐ సర్కిల్ సిస్టమ్ ఆధారంగా రన్ అవుతుంది. ఇందులో పిల్లలకు లిమిటెడ్ పాకెట్ మనీ లభిస్తుంది. కానీ, కంట్రోలింగ్ మాత్రం వారి పేరెంట్స్ చేతుల్లోనే ఉంటుంది.
ఈ ఫీచర్ ద్వారా టీనేజర్లు తమ మొబైల్ డివైజ్‌లో పేటీఎం యాప్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ పేమెంట్లు చేయవచ్చు. అయితే, ప్రతిసారీ తల్లిదండ్రులను ఓటీపీ అడగడం గానీ, డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం అవసరం లేదు. సెటప్ కంప్లీట్ చేశాక పిల్లలు నేరుగా పేమెంట్లు చేయవచ్చు.
తల్లిదండ్రులు నెలవారీ ఖర్చు లిమిట్స్ డిసైడ్ చేయొచ్చు. ప్రతి లావాదేవీని రియల్ టైంలో మానిటరింగ్ చేయొచ్చు. కంపెనీ ప్రకారం.. ఒకేసారి గరిష్టంగా రూ. 5వేలు చెల్లించవచ్చు. అయితే, మొత్తం నెలవారీ యూపీఐ ఖర్చు రూ. 15వేలకు పరిమితంగా ఉంటుంది.
సేఫ్టీ కోసం అనేక స్పెషల్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యాక్టివేషన్ అయిన మొదటి 30 నిమిషాల్లో కేవలం రూ. 500 పేమెంట్ మాత్రమే చేయగలరు. మొదటి 24 గంటలకు స్పెంట్ లిమిట్ రూ. 5వేలు మాత్రమే. పేటీఎం యాప్ కోసం డివైజ్ లాక్ చేసి ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడైనా స్పెండ్ లిమిట్ మార్చవచ్చు లేదా యాక్సెస్‌ను స్టాప్ చేయొచ్చు.
ఈ ఫీచర్ పిల్లలలో బాధ్యతాయుతమైన ఖర్చు అలవాట్లను నేర్చుకోవడానికి టీనేజర్లకు డిజిటల్ పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోగలరని కంపెనీ చెబుతోంది. వినియోగదారులు పేటీఎం యాప్‌ను అప్‌డేట్ చేస్తే ఈ ఫీచర్‌ను ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ పేటీఎం యాప్‌లోనే ఫీచర్ చూడొచ్చు.
పాకెట్ మనీ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలి? :
- పేటీఎం యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి
- యాప్ ఓపెన్ చేసి ‘మొబైల్‌కు / కాంటాక్ట్’కు వెళ్లండి.
- ‘Pocket Money’ని ఎంచుకోండి
- టీనేజర్ కాంటాక్ట్ వివరాలను ఎంచుకోండి లేదా రిజిస్టర్ చేయండి
- యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి లేదా యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి.
- వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి.
- నెలవారీ ఖర్చు లిమిట్ సెట్ చేయండి.
- లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఎంచుకుని యూపీఐ పిన్ కన్ఫార్మ్ చేయండి.
- సర్వీసును ఎనేబుల్ చేసేందుకు ఫీచర్ వాడే టీనేజర్ ఇన్విటేషన్ అంగీకరించాలి.
- పేటీఎం యాప్ ద్వారా తల్లిదండ్రులు/సంరక్షకులు, టీనేజర్ ఇద్దరూ యాక్టివేట్ చేశాక మాత్రమే ఈ ఫీచర్ యాక్సస్ చేయొచ్చు.
